తెలుగులో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా గాడ్ ఫాదర్. లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కి ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాలపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ప్రేక్షకులను కట్టి పడేశారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికే సెన్సెషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక దసర పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
సాధారణంగా ఎవరైన ప్రముఖ హీరో, హీరోయిన్ మరో స్టార్ చిత్రంలో నటించాలంటే ముందుగా ఆసక్తి చూపరు. ఒకవేళ నటించినా.. కొన్ని నిమిషాల వ్యవధికే భారీ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే.. ఇలాంటి కామియోలుకు ఓకే చెప్తారు. తాజాగా సల్మాన్ ఖాన్.. మెగస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే సల్మాన్ రెమ్యూనరేషన్ గురించి జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెర మీద కనిపించేది తక్కువ సమయమే అయినా.. సల్మాన్ భారీగానే తీసుకుని ఉంటాడని వార్తలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో గాడ్ ఫాదర్ చిత్రంలో నటించినందుకు గాను సల్మాన్ రెమ్యూనరేషన్ గురించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘గాడ్ ఫాదర్ సినిమాలో సల్లు భాయ్ యాక్ట్ చేశాడు. అందుకు గాను రెమ్యూనరేషన్ ఇవ్వడం కోసం మా నిర్మాతలు సల్లు భాయ్ దగ్గరకు వెళ్లారు. ఎంత ఇస్తారో చెప్పకముందే.. సల్మాన్ వారి మీద అరిచాడు. చెర్రి, చిరంజీవి గారంటే నాకు ఎంతో ఇష్టం. వారి మీదున్న ప్రేమను మీరు డబ్బుతో కొనలేరు. గెట్ లాస్ట్ అంటూ నిర్మాత మీద అరిచాడు. కనీసం వాళ్లు.. తనకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో కూడా పట్టించుకోకుండా.. మా మీద తనకెంత ప్రేమో చాటి చెప్పాడు. తనలా ఆలోచించేవారు చాలా తక్కువమంది ఇడస్ట్రీలో ఉంటారు. థాంక్యూ సల్లూ భాయ్’’ అన్నాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. అయితే ఈ చిత్రంలో యాక్ట్ చేసినందుకు నిర్మాతలు సల్మాన్‌కి 15-20 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని.. కానీ సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం.
When producer went and they offered amount, #SalmanKhan said you can’t buy my love towards #RamCharan and #Chiranjeevi garu with money🙌 pic.twitter.com/B6mm1nORs6
— Devil V!SHAL (@VishalRC007) September 30, 2022