‘గాడ్ ఫాదర్’ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఈ దసరాకి థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో చిరుతోపాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించాడు. వీళ్లు ఇద్దరూ డ్యాన్స్ చేసిన ‘థార్ మార్ థక్కర్ మార్’ పాట, ఈ మధ్య రిలీజై మెగా అభిమానులతో మాస్ స్టెప్పులు వేయిస్తోంది. ఇక పొలిటికల్ మాస్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న ఈ సినిమాలో చిరు.. ఓల్డ్ లుక్ తో స్టైలిష్ గా దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్ ని మొదలుపెట్టేశారు. అందులో భాగంగా మేఘాల్లో ‘గాడ్ ఫాదర్’ ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్రీముఖి.. ఈ ఇంటర్వ్యూ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘గాడ్ ఫాదర్’ చిత్రం ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పిన చిరు, ఈ సినిమా ఓ నిశ్శబ్ద విస్పోటనం అని అభివర్ణించారు. హీరోయిన్లు లేరేంటి, పాటలు లేవేంటి? అనే ఆలోచన రానివ్వని సబ్జెక్ట్ ‘గాడ్ ఫాదర్’ అని చిరు పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని, హ్యాట్సాఫ్ టూ సల్మాన్ భాయ్.. వూయ్ లవ్యూ అని ఆయన్ని మెచ్చుకున్నారు. ఇకపోతే ఇందులో జర్నలిస్టు పాత్ర చేసేందుకు దర్శకుడు పూరీ జగన్నాథ్ తొలుత అంగీకరించలేదని చిరు చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత పూరీలోనూ ఓ మంచి నటుడున్నాడని మీరే ఆశ్చర్యపోతారు అని డైరెక్టర్ ని ఆకాశానికెత్తేశాడు.
అలానే ‘గాడ్ ఫాదర్’ సినిమాకు ఆరో ప్రాణమై, 100 శాతం కంటే పైస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మ్యూజిక డైరెక్టర్ తమన్ అని చిరు చెప్పారు. ఇక చిరుని ఇంటర్వ్యూ చేసిన శ్రీముఖి.. సాల్ట్ పెప్పర్ లుక్ లో చిరుని చూసి.. మీరు చాలా హాట్ గా ఉన్నారని తెగ పొగిడేసింది. “థార్ మార్” సాంగ్ లో చిరు వేసిన స్టెప్ అమెజింగ్ అని చెప్పింది. ఇలా ఫుల్ ఆన్ ఎంటర్ టైనింగ్ గా ఉన్న ఇంటర్వ్యూ ప్రోమోని మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఫుల్ ఇంటర్వ్యూలో ఇంకెన్ని విషయాల్ని చిరు బయటపెడతారో చూడాలి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని దసరా కానుకగా అక్టోబరు 5న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకొస్తున్నారు. చిరు, సల్మాన్ తోపాటు నయనతార, సత్యదేవ్ లాంటి వాళ్లు కూడా ఇందులో నటించారు. మరి పూరీ జగన్నాథ్ గురించి చిరు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: రాజకీయాలకి దూరంగా ఉన్నా! నా నుంచి రాజకీయం దూరం కాలేదు: చిరంజీవి!