‘ఆయనో వ్యసనం.. ఒక్కసారి అంటుకుంటే వదలడం కష్టం’, ‘ఈశ్వరా… పరమేశ్వరా… పవనేశ్వరా’.. ఈ డైలాగ్స్ వినగానే పవర్ ఫుల్ బండ్ల గణేశ్ స్పీచులు మీకు గుర్తొచ్చి ఉంటాయి. ఈ డైలాగ్స్ చెబుతున్నప్పుడు స్టేజీపై బండ్ల గణేశ్.. ఎదురుగా కుర్చీలో పవన్ నవ్వుతూ ఉండే విజువల్స్ కూడా మన కళ్లముందు కదలాడుతాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని ఆకాశానికెత్తాలంటే బండ్ల గణేశ్ తప్పించి వేరే ఎవరికీ సాధ్యం కాదు. తన అభిమానాన్ని స్పీచుల రూపంలో బండ్లన్న దంచికొడుతుంటాడు. అలాంటి వీరిద్దరూ, గత కొన్నాళ్లలో కలిసే సందర్భం రాలేదు. అయినా సరే సోషల్ మీడియా వేదికగా పవన్ పై తనకున్న ప్రేమని బండ్ల గణేశ్ ఎప్పుడు బయటపెడుతూనే ఉంటాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవన్-బండ్ల గణేశ్ ది ప్రత్యేకమైన అనుబంధం. తొలిసారి కలిసి చేసిన ‘తీన్ మార్’.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. ఆ వెంటనే ‘గబ్బర్ సింగ్’ లాంటి మూవీతో ఇండస్ట్రీలో రికార్డులు సెట్ చేశారు. ఆ తర్వాత పవన్ తో కలిసి ఛాన్స్ కోసం బండ్ల గణేశ్ తెగ వెయిట్ చేస్తున్నాడు. కానీ అది సెట్ కావడం లేదు. ఇక పవన్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చే బండ్లన్న.. తన పవర్ ఫుల్ స్పీచులతో పవన్ నే కాదు అభిమానులకు మంచి కిక్కిస్తుంటాడు. ఇప్పుడు స్టేజీపై స్పీచ్ ఇవ్వకపోయినప్పటికీ, పవన్ పై ఉన్న అభిమానాన్ని చూపించాడు.
అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే
గుండెల్లో దడ దడ మొదలయ్యింది
రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్ @PawanKalyan ❤️ pic.twitter.com/ft9oyx1j9J— BANDLA GANESH. (@ganeshbandla) September 30, 2022
పవన్ హీరోగా చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే వర్క్ షాప్ ని నిర్వహించారు. ఇందులో పవన్ తో పాటు ‘హరిహర..’ టీమ్ మొత్తం పాల్గొంది. ఈ క్రమంలో పవన్.. రెడ్ టీ షర్ట్ వేసుకున్న ఫొటోలని దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణి పోస్ట్ చేశారు. ఇందులో పవన్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక పవన్ ని దేవుడిలా ఆరాధించే బండ్ల గణేశ్ అయితే అస్సలు ఊరుకోలేదు. ‘అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడదడ మొదలయ్యింది. రక్తం ఉరకలేస్తుంది. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్’ అని ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది. మరి బండ్లన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.