హరిహర వీరమల్లు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కెరీర్‌లో మొదటిసారి పవన్ కల్యాణ్ ఒక సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో నటించబోతున్నాడు. అది కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని తెరకెక్కిస్తుడటంతో.. హరిహర వీరమల్లుపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్, యాక్షన్ స్టిల్స్, పవర్ గ్లాన్స్ అన్నింటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దోపిడీ దొంగగా పవన్ లుక్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమాకి సంబంధించి ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్‌ని నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌లో తర్వాతి షెడ్యూల్ కథ, టేకింగ్, విజువల్స్, పాత్రలు, సన్నివేశాలు ఇలా అన్ని విషయాలపై డిస్కషన్స్ జరిగాయి. ఈ వర్క్ షాప్‌లో పవన్ కల్యాణ్, నిధీ అగర్వాల్, క్రిష్, కీరవాణి ఇలా ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యులు మొత్తం పాల్గొన్నారు. ఈ విజువల్స్ లో పవన్ కల్యాణ్ న్యూలుక్ అదిరిపోయింది. పవన్ కల్యాణ్ ఈ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి. రెడ్ టీషర్ట్, బ్లూ జీన్స్ లో పవన్ సూపర్ ఎనర్జటిక్‌గా కనిపించాడు. డైరెక్టర్, కో స్టార్స్ తో కలిసి కథ విషయంలో పవన్ చర్చించాడు. తర్వాతి షెడ్యూల్ అక్టోబర్ నెల 15 తర్వాతి నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ ఫొటోలలో పవన్‌తో పాటు ఒక అమ్మాయి నిలుచుని ఫొటోకి ఫోజు ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే ప్రశ్న కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పవన్- కీరవాణితో ఫొటోకి ఫోజు ఇచ్చిన ఈ అమ్మడు ఎవరు? ఆమె ఏం చేస్తుంటుంది? ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఏంటి అని కుర్రకారు తెగ వెతికేస్తోంది? అయితే.. ఆమె పేరు అమలా చేబోలు. ఆమె కర్ణాటిక్ మ్యుజీషియన్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్ కూడా. ఆమె విశాఖలో పుట్టి పెరిగింది. గీతం యూనివర్సిటీలో విద్యనభ్యసించింది. అమలా చేబోలు తల్లిదండ్రులు గోపాలకృష్ణ మూర్తి, సరస్వతి. ఈమె పాడిన పాటల్లో భీష్మ సినిమా నుంచి వాటే వాటే బ్యూటీ పాట కుర్రకారుకు తెగ నచ్చేసింది. ఇప్పుడు ఈమె హరిహర వీరమల్లు సినిమాలో ప్లేబ్యాక్ సింగర్. ఇటీవల విడుదలైన పవర్ గ్లాన్స్ లో పాడిన వారిలో అమలా చేబోలు కూడా ఒకరు. ఇప్పుడు ఈమె పవన్‌తో కలిసి ఫొటో దిగడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.