ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ జోరు పెంచారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ప్రభుత్వంపై విమర్శలు, వ్యాంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఆదివారం 600 మంది ఐటీ నిపుణులతో సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రకృతి వనరులు, విధ్వంసం, భావి తరాలకు ఏమీ ఇవ్వలేకపోతున్నామనే బాధ తనలో ఉందంటూ చెప్పారు. జల్సా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. అంతేకాకుండా తాను సరిగ్గా సినిమాలు చేస్తే రూ.25 కోట్లు టాక్స్ రూపంలోనే చెల్లిస్తానంటూ తెలిపారు. గతంలో రూ.25 కోట్లు టాక్స్ గా కట్టినట్లు ప్రస్తావించారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చింది. ప్రసంగంలో వివరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I have paid 25 crores tax by doing movies but I am here bcz I’m scared for this future generation ~ @PawanKalyan #JanasenaITSummit pic.twitter.com/vWqv1VrPOa
— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) August 14, 2022