ఈ సృష్టిలో అంతుచిక్కని రహాస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మృత్యువు. అవును అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి.. హాఠాత్తుగా కన్నుమూస్తాడు. ఇందుకు కారణాలను ఏ సైన్స్ వివరించలేకపోతుంది. అసలు మన శరీర నిర్మాణ వ్యవస్థ గురించే శాస్త్రానికి ఇంకా అంతు పట్టలేదు. ఇదిలా ఉంటే.. కొందరికి తమ మృత్యువు గురించి ముందే తెలుస్తుందా.. అంటే ఏమో కొన్నిసంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చనిపోవడానికి ముందు ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూస్తే.. అంటే తాను చనిపోబోతున్నట్లు ప్రతాప్‌కు ముందే తెలిసిందా అనే అనుమానం రాకమానదు. ఆ వివరాలు..
మలయాళం, తమిళ భాషలతోపాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు ప్రతాప్ పోతెన్ ఆకస్మికంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ప్రతాప్ పోతెన్ భౌతికకాయానికి లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు పలువురు నటులు నివాళులు అర్పించారు. నటీనటుల సంఘం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, సినీ అభిమానులు సంతాపం తెలిపారు.
ఇదిలా ఉండగా.. ప్రతాప్ పోతెన్ మరణానికి ముందు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జార్జ్ కార్టిన్ కోట్ రాసుకొస్తూ.. చాలాకాలం పాటు చిన్న మొత్తంలో లాలాజలం మింగడం వల్ల మృత్యువు సంభవిస్తుందంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయన మరణాన్ని ముందే ఊహించారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత కూడా ఆయన ‘సమస్యకు కారణమైన దానికి చికిత్స చేయకుండా.. దాని లక్షణాలకు ట్రీట్మెంట్ చేస్తే.. ఫార్మసీపై ఆధారపడటం ఆరంభిస్తారు..’ అని మరో పోస్ట్ పెట్టారు. ‘లైఫ్ ఈజ్ ఎబౌట్ పేయింగ్ బిల్స్’, ‘లైఫ్ అనే గేమ్‌ను ప్రతీ జనరేషన్ ఒకేలా ఆడుతుంది’ అని రాసుకొచ్చారు. ఈ కోట్స్ చూస్తుంటే ప్రతాప్ పోతెన్ తన మరణాన్ని ముందే ఊహించారా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారి, ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. మరి దీఇనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కాగా ప్రతాప్ పోతెన్ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాలతో కలిపి సుమారు 100 సినిమాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాకుండా 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే విడాకులు తీసుకుని విడిపోయారు.