1994లో మిస్ యూనివర్స్ గా విజయం సాధించిన సుస్మితా సేన్ బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాలుగు పదుల వయసు దాటిన ఈ సుందరి అందం ఇంకా చెక్కుచెదరలేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుష్మితా సేన్ అప్పట్లో తనకన్న చిన్నవాడైన రోమన్ షాల్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొన్నాళ్ల పాటు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొంత కాలం తర్వాత ఉన్నట్టుండి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకుని బై బై అనుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అడపదడపా సినిమాల్లో నటిస్తున్న ఈ విశ్వసుందరి ప్రస్తుతం వెబ్ స్టోరీస్ లలో నటిస్తోంది. ఇదిలా ఉంటే సుష్మితా సేన్, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ లవ్ లో ఉన్నామంటూ ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్ కు గురిచేశారు లలిత్ మోదీ. ప్రస్తుతం మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు లలిత్ మోదీ. అయితే సుష్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా లలిత్ మోదీ తెలిపాడు. ఇది కూడా చదవండి: Krithi Shetty: నాగచైతన్యతో ఉంటే ఆ ఫీలే వేరు.. కృతి శెట్టి! దీంతో నెటిజన్స్ ఊహించని రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీళ్లు ఇప్పటికే పెళ్లి కూడా చేసుకుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెటిజన్స్ కామెంట్స్ స్పందించింది ఈ ప్రేమ జంట. మాకు ఇంకా పెళ్లి కాలేదని, ఉంగరాలు మార్చుకోలేదని, ప్రస్తుతం లవ్ లో ఉన్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. పెళ్లి వార్తలపై స్పందించిన ఈ జంట క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ రపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47)