Prathap Pothen: ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించారు. ఉదయం ప్రతాప్ ఫ్లాటుకు వెళ్లిన పని మనిషి ఆయన చనిపోయి ఉండటాన్ని గుర్తించాడు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ప్రతాప్ మృతితో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలిపారు. కాగా, ప్రతాప్ ‘ఆరవం’ అనే మలయాళ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీల్లో సినిమాలు చేశారు. దర్శకుడిగా పలు హిట్టు సినిమాలు తెరకెక్కించారు. రచయితగా కూడా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. 1985లో ప్రముఖ నటి రాధికను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 1986లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. మరి, ప్రతాప్ పోతెన్ మృతిపై మీ సంతాపాన్ని అభిప్రాయాల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?