ప్రగతి ..వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు పెట్టింది పేరు. సినిమాల్లో తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రగతి నటన చాలా సహజంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా తల్లి పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా ఉన్నారు. మరి అలాంటి ప్రగతి సోషల్ మీడియా పోస్ట్‌లు చూస్తే మాత్రం అసలు ఆమె.. ఈమే ఒక్కరేనా అనే డౌట్ వస్తుంది. వెండితెరపై హోమ్లీగా కనిపించే ప్రగతి, ఇన్స్టాగ్రామ్ వీడియోలలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు.డిస్కో డాన్సర్ మాదిరి ఫాస్ట్ బీట్‌కి స్టెప్స్ వేస్తుంది ప్రగతి. ప్రభుదేవా కూడా ఈమె డాన్స్ చూసి ముక్కున వేలు వేసుకోవాల్సిందే.
తరచుగా ట్రెండీ సాంగ్స్‌కి ప్రగతి డ్యాన్స్ చేయడం పరిపాటి అయ్యింది. ఇక ఆమె డ్యాన్స్ వీడియోలు ఎంత వైరలవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో మరోసారి తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసింది ప్రగతి. 020 లో మొదటి లాక్ డౌన్ పడినప్పుడు మొదలైన ప్రగతి డ్యాన్స్ వీడియోల రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ ఏడాది మొత్తం ట్రెండింగ్‌లో ఉన్న నటీనటుల్లో ప్రగతి కూడా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ మరో హాట్ డ్యాన్స్ వీడియోతో అభిమానుల ముందుకొచ్చింది.
ఇది కూడా చదవండి: తీన్మార్ డాన్స్ పిచ్చెక్కించిన నటి ప్రగతి.. వీడియో వైరల్
తాజాగా నటి స్నేహ మురళితో కలిసి మరోసారి డ్యాన్స్ చేసింది ప్రగతి. ఇందుకు సంబంధించిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక ఇద్దరు పోటీ పడి మరీ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ఎంత జోష్‌గా ఉన్నారు.. ఈ వయసులో కూడా ప్రతి రోజు మిమ్మల్ని మీరు కొత్తగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు అద్భుతం. ఎవరో ఏదో అనుకుంటారు అనుకోకుండా.. మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు.. మీరు చాలా మందికి ఆదర్శం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Pragathi: నన్ను అలా కూడా వాడుకున్నారు! నటి ప్రగతి ఎమోషనల్ కామెంట్స్!