ఈ మద్య కొంత మంది పెళ్లి బారాత్ లో చేస్తున్న డ్యాన్సులు తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణ పబ్లిక్‌లో అయితే ఆడ, మగ అనే తేడా లేకుండా ఈ తీన్మార్ స్టెప్పులు ఎంజాయ్ చేయడం చాలాసార్లు చూశాం. ఆ మద్య ఓ పెళ్లి కూతురు ‘బుల్లెట్ బండి ఎక్కొస్తవా’ అనే పాటకు డ్యాన్స్ చేసి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించింది. పెళ్లి బారాత్ అంటే సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా తమ డ్యాన్సులతో పిచ్చెక్కిస్తుంటారు. మంచి మ్యూజిక్, హోరెత్తే బీట్ కి స్టెప్స్ ఏస్తే ఆ కిక్కే వేరు. ఆ అవకాశమొస్తే ఈ ఛాన్స్ ఎవ్వరు మిస్ చేసుకోరు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో హీరోయిన్లతో సమానంగా ఫేమ్ సంపాదించుకున్న నటి ప్రగతి. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో యంగ్ మదర్ రోల్స్ కు ప్రాముఖ్యత పెరగడంతో ప్రగతి దర్శకుల చాయిస్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రగతి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అలాంటి సెలబ్రెటీ కుర్రకారుతో తీన్మార్ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. నిజంగా కనుల విందుగానే ఉంటుంది. తాజాగా సినీ నటి ప్రగతి చుట్టూ కుర్రాళ్ల నడుమ హుషారుగా తీన్మార్ డ్యాన్స్ వేసి అదరగొట్టింది. అంతే కాదు ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. అంతే కాదు ఈ వీడియోపై కామెంట్స్ కూడా పెట్టింది. ‘ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అస్సలు మిస్ కావొద్దు.. మీ పిచ్చిని బయటపెట్టాలి. థాంక్స్ మై బాయ్స్” అంటూ ట్యాగ్ లైన్ రాసింది ప్రగతి. తాను ఒక సెలబ్రెటీనీ అన్న విషయం పక్కన పెట్టి.. సామాన్యులతో కలిసి ప్రగతి స్టెప్స్ వేయటం అందరిని ఆశ్ఛర్యానికి గురిచేసింది. ఇటీవలి కాలంలో ప్రగతి పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా దుమ్ము దులిపేస్తున్నాయి. ఈ తీన్మార్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటిలానే వైరల్ అవుతున్నాయి.