Prabhas – Samantha: సినీ సెలబ్రిటీలకు సంబంధించి ప్రతినెలా పాపులర్ హీరోలు, హీరోయిన్ల లిస్టును విడుదల చేస్తుంటాయి కొన్ని మీడియా సర్వేలు. తాజాగా ముంబైకి చెందిన ఓర్మాక్స్ మీడియా పాన్ ఇండియా పాపులర్ స్టార్స్ కొత్త లిస్ట్ రిలీజ్ చేసింది. సాధారణంగా ఓర్మాక్స్ మీడియా ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి సర్వే నిర్వహిస్తుంటుంది. హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో స్టార్స్ జాబితా రిలీజ్ చేస్తుంది.
ఈ క్రమంలో కొత్తగా తెలుగు మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల చేయగా.. ఇందులో డార్లింగ్ ప్రభాస్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అయితే.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఆ విధంగా ప్రభాస్ టాప్ లో నిలిచి సర్ప్రైజ్ చేశాడు. ఈ జాబితాలో మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాని, చిరంజీవి, విజయ్ దేవరకొండ, రవితేజ కూడా చేరారు.
ఈ ఆసక్తికరమైన తెలుగు మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ నివేదికలో అందరినీ వెనక్కినెట్టి సమంత ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాత స్థానాలలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నిలిచారు. ఇక ఈ లిస్టులో సాయి పల్లవి, అనుష్క శెట్టి, కీర్తి సురేష్, తమన్నా, రష్మిక, రకుల్, కృతి శెట్టి ఇతర స్థానాలలో నిలిచారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా కూడా ప్రభాస్, సమంత టాప్ లిస్ట్ లో చేరడం విశేషం. మరి లేటెస్ట్ పాపులర్ జాబితాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Jun 2022) #OrmaxSIL pic.twitter.com/EjnrJAmzKk
— Ormax Media (@OrmaxMedia) July 15, 2022
Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Jun 2022) #OrmaxSIL pic.twitter.com/RmAghwuEwX
— Ormax Media (@OrmaxMedia) July 15, 2022