గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. పాన్ ఇండియా మూవీలతో పాటు పాన్ వరల్డ్ మూవీలను సైతం తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అంటే బాహుబలి అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన పుష్ఫ, RRRలు తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టు పైకి ఎక్కించాయి. దాంతో తెలుగు హీరోలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలకి సంబంధించి తెలుగు మోస్ట్ పాపులర్ హీరో ఎవరని ఓర్ మ్యాక్స్ మీడియా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగులో నెం.1 హీరోగా నిలిచాడు.
గత కొంత కాలంగా తెలుగు హీరోలు కథల ఎంపికలో నూతన ఒరవడిని తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే కొత్త కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని కొన్ని కథలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ నటన పరంగా మంచి మార్కులే సాధిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రముఖ మీడియా సంస్థ ఓర్ మ్యాక్స్ మీడియా.. తెలుగులో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ ఎవరంటూ ఓ సర్వేని నిర్వహించింది. ఈ సర్వేలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాతి స్థానాల్లో జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లు టాప్-5లో నిలిచారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6వ స్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా నాని, విజయ్ దేవరకొండ, మెగస్టార్ చిరంజీవి ఇక పదవ స్థానంలో విక్టరీ వెంకటేష్ లు నిలిచారు. RRRతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు భారీ విజయాన్ని అందుకుంటే.. పుష్ఫతో బన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక మెగాస్టార్ ఆచార్యతో నిరాశపరిచినప్పటికీ.. గాడ్ ఫాదర్ తో మురిపించాడు. అయితే ఈ లిస్ట్ లో బాలకృష్ణ, నాగార్జునలు టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. తెలుగులో ప్రభాస్ నెం.1 స్థానం దక్కించుకోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Oct 2022) #OrmaxSIL pic.twitter.com/JjmFx9CCQW
— Ormax Media (@OrmaxMedia) November 16, 2022