నితిన్ మరోసారి ఊర మాస్ లుక్ లో కనిపించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. నితిన్ చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ తో సినిమా చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే.. దౌర్జన్యాలు చేసేవారిపై అగ్రెసివ్ గా యాక్షన్ తీసుకుంటూ ఉంటాడు. తన యాటిట్యూడ్ తో విలన్ల నడ్డి విరిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
మొదటి నుంచి డైరెక్టర్ విషయంలో ఈ సినిమాపై నెగిటివిటి వచ్చిన విషం తెలిసిందే. ఆ వివాదంపై ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా ప్రచారాలు జరిగాయి. అంతేకాకుండా తొలిరోజు సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో అంతా సినిమా పోయిందంటూ కామెంట్ చేశారు. అయితే సినిమాలో అంతా రొటీన్ స్టోరీ అంటూ చెప్పుకొచ్చారు. కానీ, తొలిరోజు కలెక్షన్స్ చూస్తే ఆ టాక్ ఏమాత్రం ప్రభావం చూపలేదేమో అనిపిస్తుంది. అసలు మాచర్ల నియోజకవర్గం సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఎంత రాబట్టిందో చూద్దాం.
మాచర్ల నియోజకవర్గం కలెక్షన్స్ (అంచనా):
ఈ కలెక్షన్లు చూశాక భిన్నాభిప్రాయాలు అనే మాటేలేదంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ సినిమాకి మొత్తం రూ.21.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.22 కోట్లు కలెక్ట్ చేయాలి. తొలిరోజు కలెక్షన్లు పోనూ ఇంకా రూ.16.85 కోట్లు రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. మాచర్ల నియోజకవర్గం సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.