Nishvika Naidu: ఈ మధ్య కాలంలో కొంతమంది నటీమణులు జనాల అటెన్షన్‌ను గ్రాబ్ చేయటానికి నానాతిప్పలు పడుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ.. వీడియోలు పెడుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ డోస్ కాస్త ఎక్కువయి.. చూసే వారికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా తయారవుతోంది. నెటిజన్లు ఎంత ట్రోల్ చేసినా వారు తమ పంథా మార్చుకోవటం లేదు. తాజాగా, ప్రముఖ కన్నడ నటి నిశ్విక నాయుడు ఓ వీడియో కారణంగా నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది.
నిశ్విక గోవా ట్రిప్‌కు సంబంధించిన ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ సంగతేంటంటే.. నిశ్విక నాయుడు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాళ్లతో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లింది. మేం మగవాళ్లకు ఏమాత్రం తక్కువ కాదనుకున్నారో ఏమో.. మత్తులో నిశ్విక తన స్నేహితురాలితో ఒళ్లు పై తెలీకుండా ప్రవర్తించింది. స్నేహితురాలి నుంచి పొగను లాగింది.. ఆ తర్వాత దాన్ని బయటకు విడిచింది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ స్నేహితురాలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారి, నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంది. దీంతో సదరు స్నేహితురాలు ఆ వీడియోను డిలీట్ చేసింది. అయినప్పటికి లాభం లేకపోయింది. జనాల్లోకి వెళ్లిపోయిన ఆ వీడియోపై ట్రోల్స్ పెరిగాయి. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Dhanush: ప్రభాస్, రామ్ చరణ్‌లను హెచ్చరించిన ధనుష్?