‘ఆదిపురుష్’ టీజర్ చూడగానే మీకు ఏమనిపించింది? మీకే కాదు చాలామంది నెటిజన్స్.. దీన్ని కార్టూన్ సినిమా అని ఒక్కమాటలో తేల్చేస్తున్నారు. గ్రాఫిక్స్ గురించి లెక్కలేనన్ని విమర్శలు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ కావడం ఏమో గానీ.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒకటే రచ్చ రచ్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇలాంటి సినిమానా తీసేది అని దర్శకుడు ఓం రౌత్ ని ఓ రేంజులో ఆడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆ రావణాసురుడి గెటప్ ని ట్రోల్ చేయని వాడు లేడంటే అతిశయోక్తి కాదేమో. ఇంతకీ ఏం జరుగుతోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలో పలు ప్రాజెక్టులు ఒప్పుకొన్నాడు. అందులో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణం బ్యాక్ డ్రాప్ స్టోరీ, శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు అనేసరికి ఫ్యాన్స్.. గాల్లో తేలిపోయారు. చాలారోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ నడుస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. తాజాగా అయోధ్యలో జరిగిన వేడుకలో టీజర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ.. టీజర్ చూసిన చాలామంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కార్టూన్ సినిమాలా ఉందేంటి ఏకిపారేస్తున్నారు.
శ్రీరాముడిగా ప్రభాస్ గెటప్ కంటే.. రావణాసురుడిగా సైఫ్ ని చూసి తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే రావణుడు, స్వతహాగా శివుడి భక్తుడు. కొన్ని సీన్స్ లో సైఫ్ నుదుటిపై నామాలు మిస్సింగ్, ఒంటిపై జంధ్యం కనిపించలేదు. పుష్పక విమానం స్థానంలో పక్షి ఉండటం, రావణాసురుడి గెటప్ అల్లావుద్దీన్ ఖిల్జీని పోలి ఉండటం, వానస సైన్యం కాస్త గొరిల్లా సైన్యంలా ఉందని చెబుతూ.. ప్రతి పాయింట్ ని గుర్తుచేస్తూ ‘ఆదిపురుష్’ టీమ్ పై ట్రోల్ చేస్తున్నారు. ఇక్ ప్రభాస్ నిజంగా నటించడా? లేదంటే గ్రాఫిక్స్ తో కానిచ్చేశారా అని సెటైర్స్ వేస్తున్నారు. ఇదెక్కడి బొమ్మల సినిమారా మావ అని రచ్చ చేస్తున్నారు.
మరోవైపు గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కొచ్చాడియాన్ సినిమా వచ్చింది. దీన్ని త్రీడీ యానిమేషన్ లో చిత్రీకరించారు. అప్పట్లో రజనీతో ఇలాంటి చిత్రం తీయడంపై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు ‘ఆదిపురుష్’ టీజర్ చూసి, ‘కొచ్చాడియాన్’ సినిమానే బాగుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరికొందరు అయితే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహా సీన్స్.. రామాయణంలో ఉండటం ఏంటని అంటున్నారు. అలానే టీజర్ మొత్తం నీలం, డార్క్ కలర్ లో ఉండి డ్రాకులా సినిమాని తలపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజంగానే ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ సినిమా అయితే మాత్రం.. కంటెంట్ ఎంత బాగున్నా సరే ప్రేక్షకులు ప్రభాస్ ని అలా చూడటానికి ఇష్టపడకపోవచ్చు. మరి ‘ఆదిపురుష్’ టీజర్ పై వస్తున్న ట్రోల్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
This movie is an insult to Ramayan
Firstly why are Ravan and Hanuman not wearing Mukut?
What kind of hair cut is Saif given?he’s looking like Khilji
Ravan was one of d wisest Bramhin can’t see his Janva
Pls stop hurting our sentiments #DisappointingAdipurish #AadiPurush pic.twitter.com/W3TiLgKhch— Mahadev Mundhe🇮🇳 (@mundhemahadev77) October 3, 2022
Everything’s here 😂#Adipurush #DisappointingAdipurish pic.twitter.com/DkPOyR4gO7
— Lucifer Morningstar (@Morningstar_069) October 3, 2022
Y is everything looking dark and blue instead it should have been rich and colorful. This looks more of a dracula kind of movie but not ramayan, it’s more of a gorilla warfare but not vanara sena and 500cr for this kinda 3rd class output #DisappointingAdipurish pic.twitter.com/4EbCeiqTnW
— S A N T O S H G O T T A P U (@santosh_sg07) October 3, 2022
Ravan had a Pushpak vahan to travel not a demon bat not even he was demon he was Brahmin and most religious personality #BoycottAadipurush #BoycottbollywoodCompletely #boycottTSeries #DisappointingAdipurish pic.twitter.com/IveVJvjYtR
— Anamika🌜✨ (@maa_ki_ladoo) October 3, 2022