బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. సాహో, రాధే శ్యామ్ సినిమాలతో హాలీవుడ్ రేంజ్ హీరో అయిపోయారు. దీంతో ప్రభాస్ చేయబోయే సినిమాల మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం మన డార్లింగ్.. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు చిత్రీకరణలో ఉండగా.. ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్ ని షేక్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. 24 గంటల్లో కేజీఎఫ్ 2 టీజర్ సృష్టించిన రికార్డులను.. కేవలం 15 గంటల్లోనే ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ బద్దలు కొట్టేసింది.
టీజర్ రిలీజైన 24 గంటల్లో ఎక్కువగా చూసిన బాలీవుడ్ టీజర్స్ లో 19 మిలియన్ వ్యూస్ తో సంజు మూవీ 5వ స్థానంలో, 20 మిలియన్ వ్యూస్ తో కళంక్ సినిమా 4వ స్థానం, 21.4 మిలియన్ వ్యూస్ తో భారత్ మూవీ 3వ స్థానం, 22.5 మిలియన్ వ్యూస్ తో సాహో 4వ స్థానంలో ఉండగా.. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఆదిపురుష్ కేవలం 13 గంటల్లో 31 మిలియన్ వ్యూస్ ని తెచ్చుకుంది. 17 గంటల్లో 58 మిలియన్ ప్లస్ వ్యూస్ తెచ్చుకుంది. ఇది కేవలం హిందీ టీజర్ రికార్డ్ మాత్రమే. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రిలీజైన టీజర్ కి వచ్చిన వ్యూస్ కౌంట్ చేస్తే రికార్డుల మోతే. రామ ధనుస్సు లాంటి కటౌట్ తో ప్రభాస్ రికార్డులను వేట మొదలుపెట్టారు. అడవి నాదే, వేట నాదే అన్నట్టు యూట్యూబ్ తనదే, యూట్యూబ్ లో వ్యూస్ తనవే అనేలా రికార్డ్ వ్యూస్ తో దుమ్ములేపుతున్నారు.
ఆదిపురుష్ టీజర్ రిలీజైన 15 గంటల్లో అన్ని భాషలు కలుపుకుని 70 మిలియన్ ప్లస్ వ్యూస్ క్రాస్ చేసింది. హిందీలో 60 మిలియన్ ప్లస్ వ్యూస్, తమిళంలో 7 మిలియన్ ప్లస్ వ్యూస్, తెలుగులో 3 మిలియన్ ప్లస్ వ్యూస్, మలయాళంలో 4 మిలియన్ ప్లస్ వ్యూస్ తో టీజర్ రామబాణంలా దూసుకుపోతుంది. దీంతో ఆదిపురుష్ టీజర్.. కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులను తుడిచిపెట్టేసింది. ఇండియన్ హిస్టరీలో అన్ని భాషలూ కలుపుకుని 24 గంటల్లో కేజీఎఫ్ 2 68 మిలియన్ వ్యూస్ కాగా.. తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ కేవలం 15 గంటల్లోనే ఈ రికార్డుని బ్రేక్ చేసింది. 24 గంటలు పూర్తి కాకుండానే 80 మిలియన్ ప్లస్ వ్యూస్ కి చేరుకుంది టీజర్. ఇంకొన్ని నిమిషాల్లో 100 మిలియన్ ప్లస్ వ్యూస్ తెచ్చుకోవడం ఖాయమని అనిపిస్తుంది. ఇప్పటివరకు కేజీఎఫ్ 2… 265 మిలియన్ ప్లస్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ మార్క్ ని బీట్ చేయడానికి ఆదిపురుష్ కి ఎంతో సమయం పట్టదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి యూట్యూబ్ వ్యూస్ పరంగా ఆదిపురుష్ దూసుకుపోతుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.