డార్లింగ్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ ఆదివారం విడుదలైంది. శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో.. వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతవరకు బాగానే ఉంది. ప్రభాస్, శ్రీరాముడిగా చేస్తున్నాడు అనే విషయానికే తెగ ఎగ్జైట్ అయిపోయిన ఫ్యాన్స్.. టీజర్ పై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. కానీ తాజాగా రిలీజైన టీజర్.. దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుంచి దీనికి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. బొమ్మల టీజర్ అని కొందరు అంటుంటే.. గ్రాఫిక్స్ వరస్ట్ గా ఉన్నాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలా ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్ టీమ్ ని ఘోరంగా విమర్శిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దర్శకధీరుడు రాజమౌళి, ‘బాహుబలి’ సినిమాతో ఓ స్టాండర్డ్ ని సెట్ చేసి పెట్టారు. అందులో ప్రభాస్ ని అద్భుతంగా చూపించారు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమాని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందించారు. అయితే ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకుని ఇలాంటి సినిమా తీయడం ఏంటని.. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఇదంతా పక్కనబెడితే.. ‘ఆదిపురుష్’ మూవీపై రాజమౌళి సోదరుడు ఎస్ఎస్ కాంచి పరోక్షంగా సైటెర్స్ వేశారు. పౌరాణికం తీస్తే తెలుగోడు మాత్రమే తీయాలని ట్వీట్ చేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి…
— ss kanchi శివశ్రీ కాంచి (@kanchi5497) October 2, 2022
ఇక కాంచి ట్వీట్ పై నెటిజన్స్ తలో రకంగా స్పందిస్తున్నారు. మన దర్శకులు.. పౌరాణికాలు తీసి చెడగొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరోవైపు ఉత్తరాది వాళ్లు తీసిన మహాభారతం, రామాయణం సీరియల్స్ డబ్బింగ్ వెర్షన్స్ ని మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం కదా కాంచికి గుర్తుచేస్తున్నారు. రాజమౌళి మాత్రమే ‘ఆదిపురుష్’ తీయాలా ఏంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రామాయణం ఆధారంగా తీసిన ‘ఆదిపురుష్’.. వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్ లోకి రానుంది. ఇందులో ప్రభాస్ శ్రీ రాముడు, కృతి సనన్ సీత, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకుడు. మరి ‘ఆదిపురుష్’ టీజర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.