రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయన స్వగ్రామం మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు.. ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. ఇక వీరందరికి ప్రభాస్ కుటుంబం భారీ విందు ఏర్పాటు చేస్తోంది. కృష్ణంరాజు మీద అభిమానంతో.. తమను చూడటాని వస్తున్న జనాలను సాధరంగా ఆహ్వానించి.. కడుపు నిండా భోజనం పెట్టి పంపాలని ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 50 రకాల వంటకాలతో భారీ విందును ఏర్పాటు చేస్తున్నారు.
కృష్ణంరాజు భోజన ప్రియుడు మాత్రమే కాక.. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీలో టాక్. పెదనాన్న నుంచి నటనను మాత్రమే కాక.. అతిథి మర్యాదను కూడా వాసరత్వంగా పుణికి పుచ్చుకున్నాడు ప్రభాస్. అతిథిలను వారు ఎలా ఆదరిస్తారో.. ఇప్పటికే అనేక సందర్భాల్లో వెల్లడయ్యింది. కాగా తాజాగా కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా ఒకేసారి లక్ష మందికి విందు భోజనం పెట్టి.. పెదనాన్న ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఈ మేరకు మొగల్తూరులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక విందలో భాగంగా 25 రకాల నాన్ వెజ్, 25 రకాల వెజ్ వంటలు సిద్ధం చేస్తున్నారు.
Huge crowd gathering for #PrabhasatMogalthuru 💥#Prabhas #KrishnamRajuLivesOn pic.twitter.com/XVjjSvQKcN
— GSK Media (@GskMedia_PR) September 29, 2022
ఈ ఏర్పాట్లు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఫాలోవర్లను, అభిమానులను ఇంత ఆదరంగా చూసిన సందర్భాలు చాలా తక్కువ. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లు, మిగతా కార్యక్రమాలు, ఇలా ఒక్కటేమిటి.. సందర్భం వచ్చిన ప్రతి సారి అభిమానులే తమ బలం, బలగం వారు లేకపోతే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాళ్లం కాదు అని చెబుతారు. అయితే చేతల్లోకి వచ్చేసరికి మాత్రం.. అంత ఆదరణ కనిపించదు. కానీ ఈ విషయంలో ప్రభాస్ తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
పెదనాన్న చనిపోయిన రోజు అంత విషాదంలో ఉన్నప్పటికి.. అభిమానులను పలకరించాడు. నేడు సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. ఏకంగా లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేసి మంచి మనసు చాటుకున్నాడు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు తప్పకుండా భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాడు. ప్రభాస్ తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ నువ్వు నిజంగా మనసున్న మహారాజువి అంటూ అభినందిస్తున్నారు.
Mutton curry
Mutton Biryani
Chicken fry
Chicken biryani
Chicken curry
Prawns
Stuffed crab
Bommidala pulusu
Pandugappa curry
Chitti chepala pulusu
Chandula fish fryNon veg Food for 1lakh + fans 🛐#PrabhasatMogalthuru #Prabhas pic.twitter.com/DXyMcSRKrI
— Prabhas RULES (@PrabhasRules) September 29, 2022