సినిమాలలో స్టోరీ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్స్ ఎలాంటి సన్నివేశాలైనా చేయడానికి రెడీ అయిపోతుంటారు. అలా స్టోరీ డిమాండ్ చేసే సన్నివేశాలలో.. అప్పుడప్పుడు హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు బికినీ వేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. అయితే.. సౌత్ లో బికినీ సన్నివేశాలు తక్కువ. బాలీవుడ్ లో అలా కాదు. దాదాపు అందరు హీరోయిన్స్ బికినీ వేసి ట్రీట్ ఇస్తుంటారు. అలా గతంలో బికినీ వేసిన సౌత్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకరు.
సినిమాలలో స్టోరీ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్స్ ఎలాంటి సన్నివేశాలైనా చేయడానికి రెడీ అయిపోతుంటారు. అలా స్టోరీ డిమాండ్ చేసే సన్నివేశాలలో.. అప్పుడప్పుడు హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు బికినీ వేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. అయితే.. సౌత్ లో బికినీ సన్నివేశాలు తక్కువ. బాలీవుడ్ లో అలా కాదు. దాదాపు అందరు హీరోయిన్స్ బికినీ వేసి ట్రీట్ ఇస్తుంటారు. వాళ్ళు బికినీ వేయడం కథకు అనుగుణంగానే కావచ్చు. కానీ..గ్లామర్ ప్రియులకు, అభిమానులకు పండగే అని చెప్పాలి. అలా గతంలో బికినీ వేసిన సౌత్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకరు.
నయనతార కెరీర్ ఆరంభంలో ఎలాంటి గ్లామరస్ రోల్స్ చేసిందో తెలిసిందే. ఓవైపు స్కిన్ షో చేస్తూనే.. మరోవైపు పెదవి ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ కూడా చేసేసింది. అప్పట్లోనే గ్లామర్ హీరోయిన్ గా స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ అంటే తెలుసు కదా.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ లైఫ్ లో, కెరీర్ లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొన్నేళ్లుగా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ.. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు, పాత్రలు చేసుకుంటూ పోతోంది నయన్. అంతేగాక స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఓకే చేస్తోంది. లేదంటే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో బిజీ అవుతోంది. కాగా.. ఇన్నాళ్లు సౌత్ ని ఏలిన నయన్.. త్వరలో షారుఖ ఖాన్ ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. మొదటి సినిమానే షారుఖ్ ఖాన్ సరసన అవకాశం లభించేసరికి నయన్ తో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అయిపోయారు.
దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతూ.. జూన్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా.. తాజాగా జవాన్ కి సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ సినీ వర్గాలలో వైరల్ గా మారింది. అదేంటంటే.. జవాన్ సినిమాలో నయన్ బికినీ సీన్ చేయనుందని టాక్. ఎందుకంటే.. షారుఖ్ సినిమాలలో ఇంటిమేట్ సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రీసెంట్ గా పఠాన్ లోను దీపికా పదుకొనే బికినీ ట్రీట్ అదరగొట్టింది. సో.. ఇప్పుడు జవాన్ లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ లో ఆ రేంజ్ గ్లామర్ షో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో నయన్ బికినీ సీన్ చేయబోతుందనే వార్తలు బయటికి వచ్చాయి. ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు. కానీ.. ఒకవేళ నయన్ నిజంగానే బికినీ వేసిందంటే మాత్రం.. ఇండియా షేక్ అయిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూడాలి.. మేకర్స్ నుండి ఏదైనా ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో! మరి జవాన్ సినిమాపై మీ అంచనాలు, అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.