సినీ సెలబ్రిటీలు దేవాలయాలను దర్శించుకోవడం అనేది రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి సినిమాలు, ఫారెన్ టూర్స్ లో తప్ప పెద్దగా దేవాలయాలకు వెళ్లినట్లు కనిపించరు. కాబట్టి.. హీరోయిన్స్ దేవాలయాల దర్శనం చేసుకున్నారంటే ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా చూస్తుంటారు. ముఖ్యంగా పెళ్ళైన హీరోయిన్స్ వాళ్ళ భర్తలను బయట ప్రపంచానికి రేర్ గా చూపిస్తుంటారు. ఇప్పుడంటే సోషల్ మీడియా చేతిలో ఉండేసరికి ఏదైనా అందులోనే షేర్ చేసుకుంటున్నారు. ఇదివరకు హీరోయిన్స్ భర్తలతో దేవాలయాలకు వెళ్లిన విషయాలు వార్తల్లో చూడటమే జరుగుతుండేది.
తాజాగా హీరోయిన్ నమిత తన భర్త వీరేంద్ర చౌదరితో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుంది. స్వామివారి దర్శనం అనంతరం రాజకీయాలపై ఆసక్తి ఉందంటూ చెప్పడం గమనార్హం. నమిత తన భర్తతో కలిసి ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల ఆలయ నిర్వాహకులు నమిత దంపతులకు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఇక పూజా కార్యక్రమాల అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత నమిత మీడియాతో మాట్లాడుతూ.. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని తిరుమల స్వామి సన్నిధిలో ప్రకటించింది. ప్రస్తుతం నమిత వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.