వెండితెర ఇలవేల్పు మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి నిరూపిస్తూ ‘గాడ్‌ఫాదర్’ గ్రాండ్ సక్సెస్ సాధించింది. బాక్స్ఆఫీస్గా బాప్ మెగాస్టార్ అనేలా రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దసరా కానుకగా రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్ దీపావళి వరకు తన హవా కొనసాగించేలా ఉంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో గాడ్‌ఫాదర్ పేరు మారుమోగిపోతుంది. మళయాల సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌గా వచ్చిన గాడ్‌ఫాదర్.. దానికి మించి ఘన విజయం సాధించింది. లూసిఫర్‌ను రెండు మూడు సార్లు చూసిన సినీ అభిమానులకు సైతం గాడ్‌ఫాదర్ కొత్త అనుభూతినిస్తూ.. విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు గాడ్‌ఫాదర్ మ్యానియా నడుస్తోంది.
అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ఒక అతిథి పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆయన పాత్ర కూడా సినిమాకు అద్భుతంగా ప్లెస్ అయిందని టాక్. సల్మాన్ సినిమాలో ఉంటడంతో గాడ్‌ఫాదర్ రీచ్ మరింత పెరిగిందనే చెప్పాలి. కేవలం చిరంజీవి పిలుపు మేరకు కథ కూడా వినకుండా సల్మాన్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని.. చిరు సినిమా రిలీజ్ సమయంలో వెల్లడించారు.కు చెప్పారు. చిరంజీవిపై ఉన్న నమ్మకమే ఈ రోజు సల్మాన్‌ను ఒక గ్రాండ్ సక్సెస్‌లో భాగం చేసింది. కాగా.. గాడ్‌ఫాదర్ విడుదలైన రోజు సాయంత్రం సినిమా అద్భుత విజయం సాధించిదని తెలుసుకున్న సల్మాన్.. చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ.. ఒక వీడియోను రిలీజ్ చేశారు.
‘చిరు గారు.. గాడ్‌ఫాదర్ సూపర్ సక్సెస్ అయిందని విన్నాను. కంగ్రాట్స్ లవ్యూ వందేమాతరం’ అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సల్మాన్ ఖాన్ చెప్పిన కంగ్రాట్స్కు రిప్లేగా చిరంజీవి కూడా ఒక వీడియోను ప్రత్యేకంగా విడుదల చేశారు. ‘సల్లూ భాయ్.. మీకు కూడా కంగ్రాట్స్. ఎందుకంటే ఈ గాడ్‌ఫాదర్ మ్యాస్సీవ్ సక్సెస్ వెనుక ఉన్న మసూద్ భాయ్ ఫోర్స్ ఉంది. లవ్ యూ.. వందేమాతరం’ అంటూ వీడియో పేర్కొన్నాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చిరంజీవి ఈ వీడియోను పోస్టు చేశారు.