తెలుగు ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పారు సీనియర్ నటులు కోటా శ్రీనివాస రావు. ఓ వైపు విలనీజం పండిస్తూనే కడుపుబ్బా నవ్వించేవారు. కోటా శ్రీనివాసరావు అంటే తెలుగు వారందరికీ ఇష్టమే. ఆయన ఈ మధ్య సినిమాల్లో కనిపించడం మానేశారు. వయసు మీద పడటంతో తాను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మద్య కొన్ని ఇంటర్వ్యూల్లో కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు కోట. మొన్న ఆ మధ్య జబర్ధస్త్ యాంకర్ అనసూయ బట్టల గురించి మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ… ఇండస్ట్రీలో చిరంజీవికి గొప్ప పేరు ఉంది.. ఆయన బ్యాంగ్ గ్రౌండ్ లేకుండా రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఉండగలిగేవాడు కాదు. నాకు తెలిసినంత వరకు గొప్ప నటుడు అని చెప్పుకోదగ్గ క్వాలిఫికేషన్స్ చరణ్ లో లేవని అనిపిస్తుంది. ఇక వారసత్వంగా వచ్చిన అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి కూడా తనదైన స్టైల్లో కామెంట్స్ చేశారు. ఇక ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన నటుడు జూనియర్ యన్టీఆర్ అన్నారు. అంతేకాదు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అతన్ని మించిన నటుడు లేడని సంచనల వ్యాఖ్యలు చేశారు.
తారక్ నటుడు గానే కాదు.. మంచి డ్యాన్సర్ గా అద్భుతమైన వాక్చాతుర్యం కలవాడు అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. ఓ నటుడికి కావాల్సిన క్వాలిటీలు అన్నీ తారక్ లో ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. నటనలో తాతకు తగ్గ మనవడిగా బాగా నటిస్తాడు. నా వరకు ఇండస్ట్రీలో అతనే నెం 1 హీరో అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కోట కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేశాయి. కోటా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనపై మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
ఇన్ని మాటలు రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్న కోటా శ్రీనివాస రావు ఒక్కసారి రంగస్థలం మూవీ చూస్తే అర్థం అవుతుంది. ఎవరి నటన ఎంత గొప్పగా ఉంటుందో.. అంత గొప్ప స్టార్ అయినా కూడా ఒక ప్రయోగాత్మక చిత్రం చాలెంజ్ గా చేసి చూపించాడని ఇది ఆయన చూస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారుకాదని మెగా ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు. వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గొప్ప ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చెర్రీ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పొజీషన్ లో ఉన్న విషయం కోగా గుర్తుంచుకోవాలని అంటున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక చిరంజీవి గురించి మాట్లాడు అర్హత ఆయనకు లేదని.. కరోనా సమయంలో సినీ కార్మికుల కష్టాలు తీర్చడానికి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించి ఎంతో మంది కష్టాలు తీర్చారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకు ఆయన ఇండస్ట్రీల చిన్నస్థాయిలో ఉన్నవారికి ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకున్నారని.. ఇదంతా కోటా శ్రీనివాస రావుకు తెలియదని.. ఎందుకంటే ఆయన ఇవేవీ పట్టించుకోరని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.