మహేశ్ బాబు.. ఓ సినిమాలో చెప్పినట్లు ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. ఫ్యాన్స్ కు ఆ పేరు వినగానే పూనకాలు వచ్చేస్తాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో సూపర్ స్టార్ గా ఎదిగాడు. అందరు సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ, కొంతమందికే సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ గా ఉంటారు. అలాంటి జాబితాలో మహేశ్ బాబు పేరు కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి.
రీల్ హీరోగా ఉంటూనే రియల్ లైఫ్‌లో ఎంతో మందికి గుండె ఆపరేషన్లు చేయిస్తూ మహేశ్ రియల్‌గా కూడా హీరో అని నిరూపించుకున్నాడు. సర్కారు వారి పాట సినిమా సక్సెస్ తర్వాత మహేశ్ కాస్త రిలాక్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు కూడా వెళ్లారు. తర్వాత రాజమౌళితో సినిమా చేస్తాడని ప్రచారం జరిగినా కూడా ఆ సినిమాకి ఇంకా టైముందని ప్రకటించారు.
ముందు త్రివిక్రమ్‌తో సినిమా చేసిన తర్వాతే రాజమౌళితో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ముచ్చటగా మూడోసారి ఈ కాంబోలో సినిమా రానుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మహేశ్ బయట ఎంతో రిజర్వ్డ్ గా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటూ ఉంటాడు.
చాలా గ్యాప్ తర్వాత గడ్డంతో మహేశ్ కనిపించగానే ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. మహేశ్ న్యూ మేకోవర్ కు సోషల్ మీడియా షేకై పోయింది. ఇప్పుడు ఆ గడ్డం లుక్‌లో బేర్ బాడీతో స్విమ్మింగ్ పూల్ లో కనిపించడంతో ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ అయితే తెగ షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మహేశ్ న్యూ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.