నాని ‘దసరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర చేస్తోంది. తాజాగా ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారు. ఈ చిత్రం ఎలా ఉందనేది మహేష్ ఒక్క ట్వీట్‌తో తేల్చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది ఈ మూవీ. తాను నటించిన ఏ సినిమాకూ చేయనంతగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు నాని. సినిమా మీద ఉన్న నమ్మకంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏకబిగిన ప్రమోషన్స్ నిర్వహించారు. అందుకు తగ్గట్లే ఫలితం కనిపిస్తోంది. మార్నింగ్ షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జాతర నడుస్తోంది. నాని నటించిన సినిమాల్లోకెల్లా ఫస్ట్ డే వసూళ్లలో ‘దసరా’ రికార్డు సృష్టించింది. తొలి రోజునే దాదాపు రూ.38 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ వారాంతంలో ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాని ‘దసరా’ దెబ్బకు అందరూ షాక్ అవుతున్నారు. టాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోగా చెప్పుకునే నాని.. ఒక టాప్ స్టార్ రేంజ్ వసూళ్లతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ‘దసరా’కు ఓవర్సీస్తో పాటు నైజాంలో వస్తున్న వసూళ్లు చూసి అందరూ షాక్ అవుతున్నారు. పెద్ద హీరోల సినిమాలకు సరిసమానంగా కలెక్షన్స్ ఉండటంతో టాలీవుడ్ టాప్ హీరోల లీగ్‌లోకి నాని ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుత ఊపును బట్టి చూస్తే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ కాదు.. వంద కోట్ల షేర్ సాధించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ‘దసరా’ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు వీక్షించారు. అనంతరం సినిమా ఎలా ఉందో చెబుతూ ఆయనో ట్వీట్ చేశారు. వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు మహేష్. ‘దసరా చిత్రం విషయంలో ఎంతో గర్విస్తున్నా. అద్భుతమైన సినిమా’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనికి ఫైర్ ఎమోజీలు కూడా జతచేశారు. ఏకంగా సూపర్ స్టార్ నుంచి ప్రశంసలు రావడంతో ‘దసరా’ టీమ్ సంతోషంలో మునిగిపోయింది. తాజాగా మహేష్ ట్వీట్‌కు నాని రిప్లయ్ ఇచ్చారు. ‘‘పోకిరి’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించడం ఎలాంటిదో.. మంచి సినిమాకు మీ మద్దతు దొరకడం కూడా అలాంటిదే’ అని నాని బదులిచ్చారు. సూపర్ స్టార్‌కు న్యాచురల్ స్టార్ థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్‌ను ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. మీరు ‘దసరా’ చూశారా? ఆ చిత్రం మీకెలా అనిపించిందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
So so proud of #Dasara!! Stunning cinema! 🔥🔥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP
— Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023
Thank you @urstrulyMahesh sir. Your voice of support for good cinema is what Manisharma’s score is for pokiri 🙏🏼♥️ https://t.co/mHxrCsZ1gb
— Nani (@NameisNani) March 31, 2023