ఇండస్ట్రీ జనాల మీద వచ్చినన్ని పుకార్లు.. ఇక ఎవరి మీద రావు.. సామాన్యుల గురించి అంత ఈజీగా గాసిప్స్ ప్రచారం చేసే ధైర్యం కూడా చేయరు. కానీ సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇలాంటి రూల్సేం వర్తించవు. ఇండస్ట్రీకి చెందిన ఏ ఇద్దరు ఆడామగా కాస్త క్లోజ్‌గా ఉన్నా సరే.. ఇక బొలేడన్ని రూమర్లు తెర మీదకు వస్తాయి. సదరు సెలబ్రిటీలు డేటింగ్‌లో ఉన్నారని.. లవ్ చేసుకుంటున్నారని.. పెళ్లి చేసుకోబోతన్నారంటూ లెక్కకు మిక్కిలి వార్తలు పుట్టుకొస్తాయి. ఈ తలనొప్పి భరించలేక చివరకు సదరు సెలబ్రిటీలు.. ఈ వార్తలపై స్పందించాల్సి వస్తుంది.ఈ క్రమంలో తాజాగా గత కొన్ని రోజులుగా హీరో విశాల్ పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. విశాల్, నటి అభినయను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇక కొన్ని రోజుల క్రితం విశాల్ కూడా తాను ప్రేమలో ఉన్నానని.. త్వరలోనే ఆమెను పరిచయం చేస్తాను అన్నాడు.
దక్షిణాదిలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే విశాల్ అని చెప్పేస్తారు. గతంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. పుల్ బిజీగా ఉన్నాడు విశాల్. హీరోగా నటించడమే కాక.. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోన్నాడు. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లిపై వస్తోన్న పుకార్లకు స్టేజీ మీదే చెక్ పెట్టారు విశాల్. అలానే నటి అభినయతో తన పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం విశాల్ హీరోగా నటించిన చిత్రం.. లాఠీ. ఈ సినిమా ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాడు విశాల్.
నటి అభినయను మీరు వివాహం చేసుకోబోతున్నారట కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు విశాల్ స్పందిస్తూ.. ‘‘ప్రతీ విషయానికి ఓ టైమ్ వస్తుంది. నేను మాట ఇస్తే తప్పను. ఆ మాట పూర్తయ్యే వరకు వెనకడుగు వేసేదే లేదు. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ పూర్తయిన తర్వాత వచ్చే తొలి ముహూర్తంలో నా పెళ్లి జరుగుతుంది. 3500 కుటుంబాలు, ఆ థియేటర్ ఆర్టిస్టులు.. ముప్పై సంవత్సరాల ముందు వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఇప్పటికీ నాటకాలు, డ్రామాలు వేస్తున్నారు. వాళ్లు బావుండాలనే కోరికతో మా టీమ్ ఈ ప్రయత్నం చేస్తుంది. ఆ బిల్డింగ్ కట్టించి పెన్షన్, మెడికల్ ఫెసిలిటీ.. ఇలా వారిజీవితాల్లో.. చిన్న మార్పు తీసుకురావాలని ఆశిస్తూ.. ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆ బిల్డింగ్ పూర్తి అయ్యాక నేను అందరినీ పిలుస్తాను. అలానే నా పెళ్లికి కూడా మీ అందరినీ పిలుస్తాను’’ అని విశాల్ తెలిపారు.
అయితే అభినయ పేరుని ప్రస్తావించకుండా పెళ్లి గురించి విశాల్ క్లారిటీ ఇవ్వడంతో.. ఇంతకు అభినయతోనే తన పెళ్లి అని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నాడా ఏంటి అంటూ చెవులు కొరుక్కుంటున్నారు జనాలు. ఇక గతంలో ఈ వార్తలపై అభినయ మండిపడింది. సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తే.. నిజ జీవితంలో కూడా భార్యాభర్తలం అవ్వాలని ఎక్కడా లేదుగా అంటూ ఘాటుగా స్పందించింది. ఇక ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘లాఠీ’. ఈ సినిమా.. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది.