అనన్య నాగళ్ల.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న పేరు. ‘మల్లేశం’ చిత్రం ద్వారా అనన్య తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్లేబ్యాక్’ సినిమాలోను అవకాశం దక్కించుకున్నా పెద్ద ఆకట్టుకోలేదు. ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాందించిది. సినిమాలో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలోను ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ పిక్స్ తో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తుంది. ఇక తన అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు రిప్లయ్ కూడా ఇస్తుంటుంది. కొంతకాలం నుంచి ఈ అమ్మడి పెళ్లిపై అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి వార్తలపై ఈ బ్యూటీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తేదీ, సమయం చెప్తే నా పెళ్లికి నేను వస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చింది.
ఇటీవల వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం వకీల్ సాబ్ లో దివ్వ అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాందించింది అనన్య. దీంతో అనన్యకు సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది. ఐతే అందరు తెలుగమ్మాయిల్లాగే అనన్య కూడా పరిమితంగా పాత్రలు చేస్తుందా.. లేక గ్లామర్ షోలకు రేడీనా అన్నదే ఫిల్మ్ మేకర్స్ లో సందేహంగా ఉంది. ఇటువంటి సమయంలో కొంత మేర స్కిన్ షో చేయడానికి తనకేం అభ్యంతరం లేదని అనన్య నాగళ్ల చెబుతోందట. ఆ మేరకు కొన్ని ఫోటో షూట్ లతో నిర్మాతలను, దర్శకులను ఆకట్టుకునే పనిలో పడింది అనన్య. గతంలో ఈమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. అనంతరం ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రంలో కూడా హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం కొన్ని సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. మరో వైపు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపించాయి. ఓ యువ హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపించాయి. అలాంటి వార్తలను ప్రచారం చేసే వారికి ఈ అమ్మడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “నాకు వరుడిని చూసినందుకు థ్యాంక్స్. అయితే అతడు ఎవరో నాకు కూడా చెప్పండి ప్లీజ్. తేదీ, సమయం ప్లేస్ చెప్తే నా పెళ్లికి నేను హాజరవుతాను” అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది.
Guys, thanks for selecting a groom for me 🙏 but please naku kuda evaro cheppandi with the date and time as well, so that i can attend my own wedding 😊
— Ananya Nagalla (@AnanyaNagalla) October 2, 2022
🤗 #AnanyaNagalla pic.twitter.com/RaexbXZDLo
— Ananya Nagalla (@AnanyaNagalla) July 23, 2022