కృతి శెట్టి.. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో తన జోరును కొనసాగిస్తోంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. బంగార్రాజు, శ్యామ్ సింరాయ్, ది వారియర్ వంటి వరుస హిట్ లతో కృతి శెట్టి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటూ టాప్ హీరోయిన్లకు సైతం సవాల్ విసురుతోంది.
అయితే హీరోయిన్ కృతి శెట్టి నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వీరిద్దరి కెమెస్ట్రీ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే కృతి శెట్టి నాగచైతన్య #NC22 సినిమాలో మరోసారి అతనితో కలిసి నటించనుంది. ఇదే విషయాన్ని కృతి శెట్టి స్వయంగా తెలపడం విశేషం.
ఇది కూడా చదవండి: భార్యకు పూరీ జగన్నాథ్ విడాకులు.. క్లారిటీ ఇచ్చిన అంబర్ పేట్ శంకరన్న!
దీనిపై ఆమె మాట్లాడుతూ.. నాగచైతన్యతో రెండవసారి కలిసి పనిచేసే అవకాశం దొరకడం నా అదృష్టం. నాగచైతన్య ఎంత ప్రశాంతంగా ఉంటారో తనతో కలిసి పని చేసినప్పుడే పూర్తిగా అర్థమైంది . ఏ విషయంలో అయినా సరే ఆయన చాలా నిజాయితీగా ఉంటారు . నాగచైతన్య స్వచ్చమైన మనసు కలిగిన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం అందరికీ ఎంతో స్పూర్తినిస్తుంది. ఇక ఇదే కాకుండా నాగచైతన్యతో ఉంటే ఆ ఫీలింగే వేరంటూ బేబమ్మ తన మనసులో ఫీలింగ్స్ ను బయటపెట్టింది. కృతి శెట్టి నాగచైతన్యపై తాజాగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. నాగచైతన్యపై కృతి శెట్టి చేసిన తాజా క్రేజీ కామెంట్స్ పై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.