తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో ప్రత్యేకతను మూటగట్టుకున్న సీనియర్ నటులు కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ లోకం అంతా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులే కాక రాజకీయ ప్రముఖులు సైతం ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అయితే కృష్ణంరాజుకు కుమారులు లేకపోవడంతో ఆయన కర్మ క్రియలు ఎవరు నిర్వహిస్తారనే చర్చ మాత్రం బలంగా జరిగింది.
ఈ క్రమంలోనే కృష్ణంరాజు గతంలో ఓ మీడియా ఛానెల్ పాల్గొన్న ఇంటర్వ్యూ వీడియో క్లిప్పింగ్ లు ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే? నా కొడుకులు లేని లోటును నా అన్నయ్య కొడుకులైన ప్రభాస్, ప్రభోద్ తీరుస్తారని ఆయన తెలిపారు. నేను హిందు మతాన్ని పాటిస్తానన్నారు. నేను సోల్ ఆఫ్ ది డెత్ అనే పుస్తకం చదివానని, ఆ పుస్తకం ద్వారా చనిపోయిన వారి అంత్యక్రియల గురించి పూర్తిగా తెలుసుకున్నానని ఆయన అన్నారు.
ఇక నేను చనిపోతే నా కర్మక్రియలు నా అన్నయ్య కుమారులైన ప్రభాస్, ప్రభోద్ లు తీరుస్తారని ఆయన ఆ ఇంటర్వ్యూ వీడియోలో తెలిపారు. ఇదే వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది. ఇక కృష్ణంరాజు కోరిక మేరకే ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్ ఆయన కర్మక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయం తెలిసిందే.