మధురమైన గాత్రంతో సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న సింగర్స్ వరుసగా చనిపోతున్నారు. పాటలతో తమను అలరించిన గాయకులు ఇలా మరణించడం ప్రేక్షకులను కలచివేస్తోంది.
సంగీతానికి ఎల్లలు ఉండవు అంటారు. ఈ ఇంటర్నెట్ యుగంలో మ్యూజిక్కు ప్రాంతం, భాష అనే హద్దులు చెరిగిపోయాయి. అందుకే ఎక్కడో అమెరికాలో ఒక సింగర్ పాడిన పాట ఏకకాలంలో యూఎస్‌తో పాటు భారత ప్రేక్షకులకు కూడా చేరుతోంది. అందుకే జస్టిన్ బీబర్, టేలర్ స్విఫ్ట్, ఎకాన్, బ్రిట్నీ స్పియర్స్ లాంటి పాప్ స్టార్స్‌కు అక్కడ ఎంత క్రేజ్ ఉందో ఇండియాలోనూ అంతే క్రేజ్ ఉంది. వీరితో పాటు కొరియన్ సింగర్స్‌కు కూడా మన దేశంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా, ఈమధ్య కాలంలో పాప్ సింగర్ల వరుస సూసైడ్లు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ పాప్‌స్టార్ మూన్‌బిన్ (25) గత నెలలో చనిపోవం యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా మరో పాప్ సింగర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఫేమస్ కొరియన్ పాప్ సింగర్ హేసూ (29) సోమవారం సూసైడ్ చేసుకుంది.
సౌత్ కొరియా జియోల్లబుక్-డో ప్రావిన్స్‌లోని ఒక హోటల్ గదిలో సింగర్ హేసూ విగతజీవిగా పడున్నారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హేసూ మృతదేహం దగ్గర సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. మే 20న వాంజుగన్లో గ్వాన్జుమియోన్ పీపుల్స్ డే ఈవెంట్‌కు ఆమె హాజరు కావాల్సి ఉంది. అయితే తొలుత ఈ కార్యక్రమానికి హేసూ రావడం లేదని మీడియాకు తెలిపారు ఆమె ఆర్గనైజర్లు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వార్త వెలుగుజూసింది. హేసు మరణానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలంలో దొరికిన సూసైడ్ లెటర్ ప్రకారం.. ఆమెది ఆత్మహత్యగా పోలీసులు తెలిపారు. 1993లో పుట్టిన హేసూ.. ‘మై లైఫ్’, ‘మీ’ ఆల్బమ్స్ ద్వారా 2019లో పాప్ సింగర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. ‘గాయా స్టేజ్’, ‘హ్యాంగౌట్ విత్ యూ’ ‘ది ట్రోల్ షో’ లాంటి ప్రోగ్రామ్స్‌లో పాడి మంచి గుర్తింపు సంపాదించింది.
Singer HAESOO Passes Away At Age 29https://t.co/m6tBBsxjYB
— Koreaboo (@Koreaboo) May 15, 2023