ప్రతీ సంవత్సరం సినీ పరిశ్రమలో కొన్ని వందల చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూ.. రికార్డులు సృష్టిస్తాయి. అలా ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్-2‘ ముందు వరుసలో ఉంది. కన్నడ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో సైతం విడుదలై రికార్డులు నమోదు చేసింది. తాజాగా కేజీఎఫ్-2 మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మరి ఇప్పుడు ఆ రికార్డుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందా.
సినిమాలకు సంబంధించి బాక్సాఫీస్ విశ్లేషణలు, రేటింగ్స్ ఇచ్చే సంస్థ ‘ఓర్ మ్యాక్స్ మీడియా’. తాజాగా ఓర్ మ్యాక్స్ పవర్ రేటింగ్స్ లో 90+ స్కోరు సాధించిన తొలి చిత్రంగా కేజీఎఫ్-2 వరల్డ్ రికార్డు సృష్టించింది. తెలుగు, కన్నడ, తమిళ, హీందీ, మలయాళ భాషల్లో కలిపి ఓర్ మ్యాక్స్ పవర్ రేటింగ్స్ లో ఈ ఘనత సాధించడం విశేషం. అంతేకాదు.. 2022 తొలి అర్ధభాగంలో విడుదలైన సినిమాల్లో 8.5 ఐఎండీబీ రేటింగ్స్ తోనూ ‘కేజీఎఫ్2’ అదరగొట్టింది.
కేజీఎఫ్-2 కలెక్షన్ల పరంగా కేవలం ఒక్క హీందిలోనే రూ.400 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు హీరో యశ్ నుండి మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి అనే సమాచారం లేదు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో యశ్ అతిథి పాత్రలో మెరుస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే చిత్ర బృందం మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. మరో వైపు సలార్ మూవీ రెండు భాగాలుగానూ వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో వినికిడి. మరి కేజీఎఫ్2 కొల్లగొడుతున్న రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
At the end of its theatrical run, K.G.F: Chapter 2 has emerged as the first-ever film to score 90+ on #OrmaxPowerRating (OPR) in five languages (Kannada, Hindi, Telugu, Tamil & Malayalam).
OPR is a proprietary measure on a 0-100 scale, capturing the audience response to a film. pic.twitter.com/eathneJkiW— Ormax Media (@OrmaxMedia) July 14, 2022
ఇదీ చదవండి: Nayanthara: నయనతార, విగ్నేష్ లకు ఊహించని షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్..!
ఇదీ చదవండి: వీడియో: మాస్ డ్యాన్స్ తో అదరగొట్టిన జబర్దస్త్ రోహిణి!