Nayanthara: సౌత్ ఇండియన్ స్టార్ సెలబ్రిటీ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్.. ఏడేళ్ల డేటింగ్ కి తెరదించి ఇటీవలే ఘనంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన వీరి వివాహ వేడుక మహాబలిపురంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. అయితే.. వీరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా లేనప్పటికీ, పెళ్లి వీడియో విషయంలో మాత్రం అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నయన్, విగ్నేష్ తమ పెళ్లి వీడియో హక్కులను ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థకి భారీ ధరకు అమ్మేశారు. అదీగాక ఈ పెళ్లిని సినిమాటిక్ లెవల్ లో షూట్ చేసేందుకు ఆ బాధ్యతలను దర్శకుడు గౌతమ్ మీనన్ కి అప్పగించారు. షూట్ కూడా బాగానే జరిగింది. కానీ.. తీరా పెళ్లి వీడియో టెలికాస్ట్ చేసే సమయానికి నెట్ ఫ్లిక్ సంస్థ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని బిగ్ షాక్ ఇచ్చినట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం మేరకు.. నయన్, విగ్నేష్ ల పెళ్లి జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే, పెళ్లికి సంబంధించి కీలకమైన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేశారట. ఈ కారణంగానే నెట్ ఫ్లిక్స్ వీడియో టెలికాస్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందని తెలుస్తుంది. వీరి పెళ్లికి సూపర్ స్టార్ రజినీ, షారుఖ్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ విచ్చేశారు. ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసినందుకు నెట్ ఫ్లిక్స్.. నయన్ దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ క్రమంలో ఇలా ఎందుకు చేశారనే ప్రశ్నకు.. ఆలస్యం చేస్తే తమ పెళ్లి వీడియోపై అభిమానుల్లో ఆసక్తి పోతుందనే ఉద్దేశంతో ఫోటోలు షేర్ చేసినట్లు నయన్, విగ్నేష్ సదరు నెట్ ఫ్లిక్స్ టీమ్ కి చెప్పుకున్నారట. కానీ.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ డీల్ క్యాన్సల్ రద్దు చేసుకోవడంతో ఈ దంపతులు నిరాశకు గురైనట్లు టాక్. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ పెళ్లి వేడుకకి నెట్ ఫ్లిక్స్ సంస్థ పెద్ద మొత్తంలో ఖర్చుని భరించిందట. ఇదిలా ఉండగా.. నయన్ పెళ్లి వీడియో టెలికాస్ట్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ. 25 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. ఇక ఇప్పుడు ఈ జంట చేసిన పనికి ఆఫర్ ని వెనక్కి తీసుకుంది నెట్ ఫ్లిక్స్. మరి ఎంతో ఆనందంగా పెళ్లి మూమెంట్స్ షూట్ చేసుకున్న వీడియో విషయంలో అడ్డంకులు వచ్చేసరికి నయన్, విగ్నేష్ లతో పాటు ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నయన్ - విగ్నేష్ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Altee & SRK at Beauty Queen Nayan & Vignesh Wedding Ceremony. All of them are looking stunning #SRK #Nayantharawedding #Atlee#ShahRukhKhan @iamsrk @Atlee_dir pic.twitter.com/tcAimVA5ZU — Mejbah Uddin (@Majba123) July 9, 2022 #Superstar #Rajinikanth and Dir #ManiRatnam , #ShahRukhKhan, Dir #Atlee, #Nayanthara and @VigneshShivN at their wedding !! #WikkiNayan #NayantharaWedding #NayantharaVigneshShivan pic.twitter.com/UcuU57uuvO — SumanTV (@SumanTvOfficial) July 9, 2022