Tiger Shroff: ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, హోస్ట్ కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్’ మూడు కామెంట్లు, ఆరు కాంట్రవర్సీలుగా నడుస్తోంది. సౌత్,నార్త్ అన్న తేడా లేకుండా అందర్నీ షోకు పిలిచి కరణ్ వారి పర్సనల్ విషయాలు రాబడుతున్నాడు. శృంగారంపై ప్రశ్నలు అడిగి షోను వార్తల్లో నిలిచేలా చేస్తున్నాడు. చాలా ఎపిసోడ్లనుంచి ఇదే తతంగం నడుస్తోంది. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ హీరో, హీరోయిన్లు టైగర్ ష్రాఫ్, కృతి సనన్‌లు కరణ్ షోకు వచ్చారు. ఈ సందర్భంగా కరణ్, టైగర్‌కు ఓ ప్రశ్న వేశాడు. ‘‘ నువ్వు కోర్కె తీర్చుకున్న ఓ భిన్నమైన ప్లేస్ ఏది?’’ అని అడిగాడు. దీనికి టైగర్ సమాధానం ఇస్తూ.. ‘‘ అదంత భిన్నమైనది కాదు.. గాల్లో చేయటం నాకు ఓ సాహసంలా అనిపించింది’’ అని చెప్పుకొచ్చాడు.
ఆ వెంటనే కరణ్ దాని గురించి మాట్లాడుతూ.. ‘‘ గాల్లో ఎలా చేస్తారో నాకు తెలీదు. దాని గురించి షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. నేను కూడా అలా చేద్దామని చూశాను. కానీ, దొరికిపోకుండా తప్పించుకున్నాను. అదో పెద్ద గందరగోళం అయింది’’ అని తెలిపాడు. తర్వాత హీరోయిన్ కృతి సనన్‌ను కూడా ఓ ప్రశ్న వేశాడు. ‘‘ నువ్వు ఇప్పటి వరకు సింగిల్‌గానే ఉన్నావ్. ఎవరైనా ఉన్నారా?.. ఓ రూమర్ కూడా ఉంది. అది నా పార్టీలోనే స్టార్ట్ అయింది.
అక్కడ చాలా మంది కృతి సనన్, ఆధిత్య రాయ్ కపూర్ల జంట చక్కగా ఉందని అన్నారు. ఓ మూల రొమాన్స్ చేసుకుంటున్నారని కూడా అన్నారు’’ అని అన్నాడు. దీనికి కృతి సనన్ సమాధానం ఇస్తూ.. ‘‘ మేము ఇద్దరం జంటగా బానే కనిపిస్తాం. నా గురించి నీకు తెలుసు, మూలన పాడు పనులు చేయనని. కానీ, మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. అతడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుంది’’ అని చెప్పారామె. మరి, కరణ్ జోహార్ వేస్తున్న శృతి మించిన ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Liger Movie: హీరో తండ్రిని చూపించకపోవడమే ‘లైగర్’ ప్లాప్ కి ప్రధాన కారణమా?