ఈ మధ్యకాలంలో సినిమాలు విజయవంతంగా థియేటర్లలో ఆడుతున్నప్పుడే ఓటిటిలోకి రాబోతుందంటూ వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం. సినిమా విడుదలై రెండు రోజులు కాకముందే ఓటిటిలో వచ్చేస్తుందని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే.. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నప్పుడు కూడా ఓటిటి రిలీజ్ అనే వార్తలు అప్పుడప్పుడు మేకర్స్ వరకు వెళ్తుంటాయి. తాజాగా బ్లాక్ బస్టర్ ‘కాంతార‘ మూవీ విషయంలో కూడా ఇలాంటి వార్తలే హాట్ టాపిక్ గా మారాయి. సెప్టెంబర్ 30న విడుదలైన కాంతార.. కన్నడలో ముందుగా రిలీజ్ అయ్యింది.
అక్కడ పాజిటివ్ టాక్ రావడంతో మేకర్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే.. ముందునుండి ఉన్న పాజిటివ్ టాక్ ఇంకా బలపడి.. మిగతా భాషల్లో కూడా కాంతార అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే.. రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 220 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. ఇప్పటికీ ప్రతి రోజూ కలెక్షన్స్ బాగానే రాబడుతోంది. ఇలాంటి సమయంలో కొద్దిరోజులుగా కాంతార ఓటిటి రిలీజ్ అంటూ కథనాలు వైరల్ అవుతున్నాయి.
ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారి చెవిన పడటంతో.. అదంతా ట్రాష్ అని, త్వరలో తామే క్లారిటీ ఇస్తామని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. కాంతార ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కాబోతుందనే వార్తలను కొట్టివేసిన మేకర్స్.. ఇప్పుడు మళ్లీ పునరాలోచనలో పడ్డారని టాక్. ఎందుకంటే.. కాంతార ఓటిటి రిలీజ్ ని నవంబర్ 4నే ఫిక్స్ చేసుకున్నారని, ఆ ఒప్పందం ప్రకారమే సినిమాను స్ట్రీమ్ చేస్తే బాగుంటుందని అమెజాన్ వారు చెప్పారట. దీంతో కలెక్షన్స్ రాబడుతున్న సినిమాకు అప్పుడే ఓటిటి రిలీజ్ ఏంటని మేకర్స్ సందిగ్ధంలో పడినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నవంబర్ 4న కాదు.. 18న రిలీజ్ కానుందని కూడా టాక్ నడుస్తోంది. మరి కాంతార ఓటిటి రిలీజ్ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Kantara#Kantara OTT RELEASE NOVEMBER 4
Only (Kannada) language@PrimeVideoIN pic.twitter.com/cBIPXOsJuh— OTTGURU (@OTTGURU1) October 27, 2022
Upcoming OTT Releases:
Oct 27 – #NaaneVaruvean – Prime.
Oct 28 – #Aadhaar – Simply South.
Nov 4 – #Brahmastra – Hotstar.
Nov 11/18 – #Kantara – Prime.
Nov 25 – #Prince – Hotstar, #Sardar – Aha Tamil & #PonniyinSelvan1 – Prime. pic.twitter.com/v35CcSPNiT
— OTT STREAM UPDATES (@newottupdates) October 26, 2022