ఈ ఏడాది డబ్బింగ్ రూపంలో విడుదలవుతున్న సినిమాలన్నీ తెలుగులో అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు కన్నడ నుండి విడుదలైన కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ, 777 చార్లీ సినిమాలు బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ పూర్తిచేసి క్లీన్ హిట్స్ గా నిలిచాయి. ఈ కోవలో రీసెంట్ గా విడుదలైన కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కాంతార‘. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమా.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 230 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. సెప్టెంబర్ 30న కన్నడ వరకే విడుదలైన కాంతార.. పాజిటివ్ పబ్లిక్ టాక్ తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి డబ్ అయ్యింది.
ఈ క్రమంలో కన్నడ వెర్షన్ విడుదలైన రెండు వారాల తర్వాత.. అక్టోబర్ 15న కాంతార తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇక మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. విడుదలైన ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేయడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంతార చిత్ర హక్కులను రూ. 2 కోట్లకు దక్కించుకొని తెలుగులో రిలీజ్ చేశారు. భారీ హైప్ తో రిలీజైన కాంతార.. ఫస్ట్ డే నుండే కలెక్షన్స్ అదరగొడుతోంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. పుంజర్లి తెగకు చెందిన భూతకోల నేపథ్యంలో తెరకెక్కింది. ఇక తెలుగులో విడుదలై 15 రోజులు దాటినా.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతోంది కాంతార.
ఈ క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాలలో కాంతార.. రూ. 50 కోట్ల మార్క్ దాటి దూసుకుపోతుంది. కేవలం రెండు కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన కాంతార.. ప్రస్తుతం రూ. 25 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా తెలుగు వరకు సంబంధించి కాంతార కొత్త రికార్డు నమోదు చేసింది. రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి స్థానంలో కేజీఎఫ్ 2 ఉంది. మరోవైపు అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలలో కాంతార.. 6వ స్థానంలో నిలవడం విశేషం. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్, ఆదరణను సొంతం చేసుకోవడం రేర్ గా జరుగుతోంది. మరి ఇలాంటి అరుదైన విజయాన్ని అందుకున్న కాంతార.. ఈ స్థాయి హిట్ కి అర్హత కలిగిందేనని సినీవర్గాలు చెబుతున్నాయి.
#KantaraTelugu collects over 𝟓𝟎𝐜𝐫 gross worldwide 💥
Watch the BLOCKBUSTER #Kantara in theaters near you! 🔥
🎟️: https://t.co/bEVPg8vnJf @shetty_rishab @VKiragandur @hombalefilms @GeethaArts @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/xxmpTbLdFu
— Sreedhar Sri (@SreedharSri4u) November 2, 2022