ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వస్తున్న సినిమాలే కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రమైనా భారీ హిట్ నమోదు చేస్తోంది. ఇప్పటికే తెలుగు నుండి కార్తికేయ 2 చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు చూశాం. మోస్తరు అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ 2.. దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు అదే జాబితాలో చేరింది కన్నడ చిత్రం ‘కాంతార‘. కేజీఎఫ్ ఫేమ్ విజయ్ కిరంగదుర్ నిర్మించిన ఈ చిత్రం.. ఇటీవలే విడుదలైం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కాంతార.. తాజాగా తెలుగులో రిలీజ్ చేశారు నిర్మాత అల్లు అరవింద్.
ఆల్రెడీ కన్నడలో బ్లాక్ బస్టర్ కాబట్టి.. ఈ సినిమాకు తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన ఈ చిత్రం.. మిస్టరీ థ్రిల్లర్ గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే.. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ రాబట్టిన కాంతార.. తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ సినిమా రూ. 2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుని రిలీజ్ కాగా, మొదటి రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేయడం విశేషం. రిషబ్ శెట్టి యాక్షన్.. గ్రిప్పింగ్ కథాకథనాలకు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. విజువల్స్ తో కాంతార థియేటర్స్ లో మాస్ జాతర చేస్తోంది. కాంతార తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులకే రూ. 4.90 కోట్లు షేర్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో ఇప్పటికే డబుల్ బ్లాక్ బస్టర్ ని దాటి దూసుకుపోతుంది.
Mass Collections 🤙🤙#KantaraMovie #Kantara #RishabhShetty
Follow us 👉 @tollymasti pic.twitter.com/kr9aC722wW— Tollymasti (@tollymasti) October 17, 2022