సాధారణంగా సినీ పరిశ్రమలో నట వారసులుగా హీరోల కొడుకులు, కూతుర్లు అడుగుపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది నట వారసులుగా తమదైన ముద్ర వేసి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరో కూతురు సైతం సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోందనే వార్త పరిశ్రమ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇంతకి ఆమె ఎవరో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని. ఇప్పటికే అన్ స్టాపబుల్ షో ను మెుదటి నుంచి ఆమె వెనకుండి నడిపిస్తోంది. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఈ షోకు క్రియేటీవ్ కన్సల్టెంట్ గా తేజస్విని వ్యవహరించిన విషయం చాలా మందికి ఈ మధ్యే తెలిసింది. అయితే ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలు షో విజయవంతం అవడానికి చాలా ఉపయోగపడ్డాయి.
నందమూరి బాలకృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. అటు రాజకీయలతో.. ఇటు సినిమాలతో.. మరో వైపు టాక్ షోతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబానికి చెందిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోందని. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందం తేజస్వినిది. దాంతో ఈమె హీరోయిన్ గా అడుగుపెడుతుందేమో అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక తేజస్విని బయట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఇక అన్ స్టాపబుల్ షో ద్వారా తనలో ఉన్న టాలెంట్ ను బుల్లితెరకు పరిచయం చేసింది. అదే టాలెంట్ ను ఇప్పుడు వెండితెరకు పరిచయం చేయడానికి రడీ అయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోన్న మాట మాత్రం.. తేజస్విని నిర్మాతగా మారబోతోందట. తన తండ్రి హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథ రడీగా ఉందని, డైరెక్టర్ కోసం వెతికే పనిలో తేజస్విని ఉందట. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ఆమె భావిస్తున్నట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. దాంతో లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా రావాలని చూస్తోందట ఈ నందమూరి వారసురాలు. బాలకృష్ణతో గ్యారంటీగా హిట్ పడాలి అంటే.. డైరెక్టర్ బోయపాటి శ్రీను నే కరెక్ట్ అని తేజస్విని భావిస్తున్నట్లు చర్చజరుగుతోంది. అదీ కాక ఈ మూవీని 2024 ఎన్నికల ముందే తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే బోయపాటికి సినిమాకు సంబంధించిన సమాచారం అందినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తారో లేదా మెగాఫోన్ పట్టుకుంటారో తెలియాలి అంటే అభిమానులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.