Kalyan Ram: ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండి తెర ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నట వారసులుగా వారి కుమారులు హరికృష్ణ, బాలక్రిష్ణలతో పాటు కొంతమంది మనవళ్లు కూడా సినీ రంగంలోకి వచ్చారు. అలాంటి వారిలో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. ఆయన హీరోగా నటించిన సోషియో ఫాంటసీ సినిమా ‘బింబిసార’ విడుదలకు సిద్దమైంది. ఆగస్టు 5 థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు.
తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పొలికల్ ఎంట్రీపై ఆయన స్పందించారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘ నాకైతే తెలీదు.. ప్రస్తుతానికి యాక్టింగ్‌లో ఉన్నాను. రెండు పడవల మీద కాలేసి ఎప్పుడూ ప్రయాణం చేయకూడదు. అది నా బాడీకి కరెక్ట్ కానీ, నా మైండ్‌కు కరెక్ట్ కాదు. అది ఏదైనా కావచ్చు. నేను ప్రస్తుతం నా నటన, సినిమాల మీద ఫోకస్‌గా ఉన్నాను. కచ్చితంగా పాలిటిక్స్ అవసరం అనుకున్నపుడు..సినిమాలు నా జీవితంలోంచి బయటకు వెళ్లిపోతాయి.
రాజకీయాలు వస్తాయి. కానీ, దానిపై కూడా క్లారిటీ లేదు. నాక్కూడా తెలీదు’’ అని సమాధానం ఇచ్చారు. కాగా, ‘బింబిసార’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ.కె నిర్మించారు. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. మరి, పొలిటికల్ ఎంట్రీపై కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరు, సల్మాన్ స్టెప్పులు!