కల్యాణ్ రామ్.. ఓ మాస్ నటుడిగా తనని తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అయితే కల్యాణ్ రామ్ ఎప్పుడూ కమర్షియల్ యాస్పెక్ట్ కోసమే కాకుండా.. కొన్నిసార్లు విభిన్నమైన కథలను కూడా ఎంచుకుంటూ ఉంటాడు. అయితే కెరీర్‌లో చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు బింబిసార సినిమాని నిర్మించి, నటించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాడు. సోషియో ఫాంటసీ చిత్రంలో కూడా ఓ విభిన్న కోణాన్ని, కథను చూపించాడు. అలాగే అతనిలోని నటుడి రెండో కోణాన్ని కూడా పరిచయం చేశాడు. బింబిసార సినిమా అంత భారీ స్థాయి విజయం సాధించింది అంటే అందుకు కల్యాణ్ రామ్ కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
ఇప్పుడు కల్యాణ్ రామ్ మరో విభిన్నమైన కథ, సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది కల్యాణ్ రామ్ కెరీర్ లో 19వ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోమవారం విడుదల చేశారు. ఈ టైటిల్, కల్యాణ్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా టైటిల్ కూడా చాలా కొత్తగా పెట్టారు. అమిగోస్ అంటూ స్పానిష్ పదంతో టైటిల్ ప్లాన్ చేశారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Hola #Amigos ❤️🔥
Expect the unexpected!
See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. “హీరో తనలా పోలి ఉన్న మనుషులు ఎంత మంది ఉన్నారు? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు ఒక యాప్‌ని వినియోగిస్తాడంట. అయితే అతనికి మరో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారిలో ఒక వ్యక్తికి ఆరు వేళ్లు ఉంటాయి. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మాత్రం నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తంట. అంటే అతని వల్ల మిగిలిన ఇద్దరికీ ఏదైనా ప్రమాదం జరగడం లేదా మిగిలిన వాళ్ల స్థానాలను అతను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలాగే సినిమా బృందం చెప్తున్నట్లు నీలాంటి వ్యక్తి నీకు ఎదురైతే నీకు మరణం తప్పదు అని క్యాప్షన్ పెట్టారు. అలా చూసుకున్నా కూడా కథలో జరిగేది అదే అని అర్థమవుతుంది. అయితే ఈ స్టోరీ లైన్ ఇప్పటిది కాదు. ట్విట్టర్‌లో డిసెంబర్ 31, 2021లోనే ఈ స్టోరీలైన్ లీకైంది. అప్పటి నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు 2023, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నారనమాట.
Kalyan Ram New Movie Story Leak pic.twitter.com/NqhFbFbTxp
— Sekhar Rambo (@RamboSekhar) November 7, 2022