ఈ ఆధునిక జీవితంలో సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం మెుత్తం మన అర చేతిలో ఉంటోంది. దీంతో మనకు కావాల్సిన విషయాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే వారు చేసే ఏ చిన్నపని అయినా సరే వారు దాన్ని తమ అభిమానుల కొరకు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి ఓ ఫొటోను తన ఇన్ స్టా లో షేర్ చేసింది. అయితే ఈ పిక్ పై కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అల్లు అర్జున్.. చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక ఆయన సతీమణి అల్లు స్నేహా రెడ్డి కూడా ఫ్యామిలీ ఫొటోలతో, తన పిక్స్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఈ మధ్య కాలంలో ఫొటో షూట్ లతో హీరోయిన్ లకు తీసిపోని విధంగా షూట్ లు చేస్తోంది. ఈ క్రమంలోనే మెున్న బ్లాక్ డ్రెస్సులో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే స్నేహ మరో సారి లేటెస్ట్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.
తాజాగా స్నేహా రెడ్డి మరో సారి తన ఫొటోలను ఇన్ స్టా బ్లాగ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. బంగారు వర్ణంలో మెరిసిపోయే చిరకట్టులో స్నేహ చాలా అందంగా ఉంది. ఈ పిక్ పై మెగాస్టార్ రెండవ అల్లుడు కళ్యాణ్ దేవ్ స్పందించాడు. స్నేహ ఫొటోపై కామెంట్ చేస్తూ.. ఫైర్ ఎమోజీతో పాటు స్నేహా.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ తో పాటు ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. కళ్యాణ్ దేవ్ కామెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.