టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది హీరోలు తమ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. ఇక సిక్స్ ప్యాక్ తో హీరోలు ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే వారు అలా సిక్స్ ప్యాక్ లు చేయడం వెనుకు చాలా కృషి ఉంటుంది. ప్రత్యేక ఫిట్ నెస్ నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలో హాలీవుడ్ నుంచి ట్రైనర్లను పిలించుకుంటారు. అలా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ సెలబ్రేటీల కు ట్రైనర్ గా వ్యవహరించిన వారిలో లాయిడ్ స్టివెన్స్ ఒకరు. ఆయన గతంలో తారక్ కు ఫిట్ నెస్ కోచ్ గా వ్యవహరించారు. అయితే తాజాగా మహేష్ బాబుకు ట్రైనర్ వ్యవహరించునున్నారు అనే టాక్ వినిపిస్తుంది. అందుకు బలం చేకూర్చేలా లాయిడ్ స్టివెన్స్.. మహేష్ బాబుతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాయిడ్ తన.. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేసుకున్నారు. మహేష్ బాబుతో హాలీవుడ్ స్టివెన్స్ దిగిన ఫోటో పై పలువురు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస కాంబినేషన్ ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అలానే రాజమౌళి డైరెక్షన్ మహేష్ ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలో ఒక సినిమా కోసం ఫిట్ నెస్ ట్రైనర్ గా లూయిడ్ ను మహేష్ రప్పించారని అనే టాక్ వినిపిస్తోంది. గతంలోనూ యన్టీఆర్ కి లాయిడ్ ఫిట్ నెస్ ట్రైనర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో యన్టీఆర్ ని ఓ రేంజ్ మార్చేశాడు ఈ హాలీవుడ్ ట్రైనర్. తాజాగా మహేష్ బాబుతో లూయిడ్ తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాడీ ఫిట్ నెస్ విషయంలో ఇంత కేర్ తీసుకుంటే.. ఇక రాబోయే సినిమాలో మహేష్ బాబు ఏ రేంజ్ లో కనిపించబోతాడోనని ఆయన ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. మరి.. వైరల్ అవుతోన్న ఈ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Lloyd Stevens (@lloydstevenspt) ఇదీ చదవండి: నేను పెళ్లి చేసుకున్న ఆమెకు అప్పటికే విడాకులు, ఓ బాబు ఉన్నాడు: బ్రహ్మాజీ ఇదీ చదవండి: నేను బ్రాహ్మిణ్‌ని.. ఆ తప్పు ఎప్పటికీ చేయను: అనసూయ