అఖండ లాంటి భారీ విజయం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తుండగా.. మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న వీర సింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. ఇలాంటి తరుణంలో వీరసింహారెడ్డి మూవీకి సంబంధించి నందమూరి ఫ్యాన్స్ అంతా పండగ చేసుకునే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
బాలకృష్ణ సినిమా అంటేనే ఖచ్చితంగా మాస్ క్లాస్ అన్ని ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తుంటారు దర్శకులు. ఈ సినిమాలో కూడా పక్కా మాస్ రాయలసీమ అంశాలతో పాటు సాలిడ్ స్టోరీ పాయింట్ కూడా ఉందని చెబుతూ వస్తున్నాడు దర్శకుడు గోపీచంద్. బాలయ్యతో మాస్ సినిమా.. అందులోను మాస్ డైలాగ్స్.. లుక్స్, క్యారెక్టరైజేషన్ ఇలా ప్రతిదీ మాస్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో వీరసింహారెడ్డికి మరో అంశాన్ని కూడా యాడ్ చేస్తున్నాడట డైరెక్టర్. అవును.. బాలయ్య సినిమాకి ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నాడట. ఈ విషయమై ఆల్రెడీ ఎన్టీఆర్ తో డైరెక్టర్ చర్చలు జరిపాడని టాక్.
ఇదిలా ఉండగా.. బాబాయ్ బాలయ్య సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించాడని సినీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో లేదో తెలియలేదు. కానీ.. బాలయ్య సినిమాకి ఎన్టీఆర్ మాస్ వాయిస్ యాడ్ అయితే.. ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుందని గట్టిగా చెప్పవచ్చు. వీరిద్దరికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. సో.. బాబాయ్ కోసం అబ్బాయ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడనే వార్తే తెలిసి నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో ఓ మాస్ సినిమా ప్లాన్ చేశాడు. చూడాలి మరి త్వరలో వీరసింహారెడ్డి వాయిస్ ఓవర్ పై విషయంపై క్లారిటీ రానుందేమో!
JAN 12 MOVIE ANTE
OKA 5 -7 DAYS MUNDHU PRE REALESE FUNCTION UNTADHI
#NTRFORNBK ???Okavela jarigithe
Babay abbay on Same Stage 🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/3ys05HITFc
— RAMMAYA (@mokshith7805) December 4, 2022