చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది నటీ, నటులు వస్తుంటారు. ఈక్రమంలోనే చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన చాలా మంది.. హీరోలుగా, హీరోయిన్ లుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేసిన చిన్నారులు ఇప్పుడు గుర్తు పట్టనంతగా మారిపోతున్నారు. హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాడు. జై చిరంజీవ చిత్రంలో మెగాస్టార్ కు మేనకోడలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ను మీరిప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయింది శ్రియా శర్మ.
జై చిరంజీవ చిత్రంతో తెలుగు తెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది శ్రియా శర్మ. ఈ చిత్రంలో మెగాస్టార్ తో కలిసి పండిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీతో పాటు రచ్చ, ఎటో వెళ్లిపోయింది మనసు, తూనిగ తూనిగ, గాయకుడు, నిర్మలా కాన్వెంట్ లాంటి చిత్రాల్లో మెరిసింది శ్రియా శర్మ. కేవలం తెలుగులోనే కాకుండా హీందీలోనూ పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. 2011లో వచ్చిన ‘చిల్లర్ పార్టీ’ సినిమాలో నటనకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది.
ఈ క్రమంలోనే 2015లో వచ్చిన గాయకుడు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తూనే ఉంటుంది. తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా హీరోయిన్ గా, హీరోయిన్ ఫ్రెండ్ గా నటిస్తూ.. మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రియా శర్మ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు జై చిరంజీవలో చూసిన అమ్మాయి ఈ పిల్లేనా అన్నంతగా మారిపోయింది. బొద్దుగా.. ముద్దుగా.. ఉన్న శ్రియా శర్మ కుర్రాళ్లను తన పిక్స్ తో కవ్విస్తోంది.