బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. జబర్దస్త్ లోకి రాకముందు జనాలకు పెద్దగా తెలియని వర్ష.. షోలోకి వచ్చాక మంచి క్రేజ్ దక్కించుకుంది. తోటి కమెడియన్ ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్స్ నడుపుతున్నట్లుగా స్కిట్స్ లో నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. జబర్దస్త్ లో క్లిక్ అవ్వడంతో సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. జబర్దస్త్ లో యాంకర్ అనసూయ, రష్మీల తర్వాత గ్లామర్ పరంగా వర్షనే అందరి దృష్టిలో పడింది. అయితే.. మొదటి నుండి కొన్ని అభ్యంతరకరమైన కామెంట్స్, ట్రోల్స్ ఫేస్ చేస్తూనే ఉంది.
జబర్దస్త్ లో సుధీర్ – రష్మీల తర్వాత వర్ష – ఇమ్మానుయేల్ జంటకే మంచి ఫేమ్ వచ్చింది. చూసే జనాలకు కూడా వీరి మధ్య ఏదో ఉందనుకునేలా బిహేవ్ చేస్తూ వస్తున్నారు. నిజానికి వర్ష వచ్చాకే ఇమ్మానుయేల్ కి క్రేజ్ పెరిగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ.. కొన్నిసార్లు స్కిట్ లో భాగంగా ఇమ్మానుయేల్ వేసే పంచులు విని బాధ పడుతుంటుంది వర్ష. చూసేవాళ్లకు కూడా వర్షపై ఇమ్మానుయేల్ వేసే పంచులు వల్గర్ గా ఉన్నాయని ఇట్టే అర్థమవుతుంది. కానీ.. చివరికి అది స్కిట్.. మేము మంచి స్నేహితులం అని చెప్పేసరికి ఫ్యాన్స్ కి కూడా అడగడానికి ఏ ఛాయస్ లేకుండా పోతుంది.
ఈ క్రమంలో జబర్దస్త్ షో గురించి ఇటీవల వర్ష ఓ కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ట్రోల్స్ వలన.. ఇంట్లో వాళ్ళు జబర్దస్త్ షో మానేస్తే మంచిదని అన్నారని చెప్పి అందరికి షాకిచ్చిందట. ఇమ్మానుయేల్ తో తన కెమిస్ట్రీ జనాల్లోకి వల్గర్ గా వెళ్తోందని.. అందుకే కామెంట్స్ కూడా దారుణంగా ఉంటున్నాయని వాపోయిందట. మరోవైపు వర్ష బర్త్ డేకి ఇమ్మానుయేల్ ఏకంగా హారం కొనిచ్చాడని.. ఏ షోలో అయినా వీరిద్దరూ కలిసి స్కిట్స్ చేస్తున్నారు కదా.. కాబట్టి, పెళ్లి చేసుకుంటారా? అనే కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో కామెంట్స్ చూసి భరించలేక ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో వర్ష ఉందని అంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్స్ తో అందాలన్నీ ఆరబోస్తున్న వర్ష.. ఇప్పుడిప్పుడే ఫేమ్ సొంతం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో జబర్దస్త్ మానేయాలని ఇంట్లో వాళ్ళు చెప్పారని.. అందుకే తాను కూడా ఆలోచనలో పడ్డానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ.. ఇది నిజమా కాదా అనే విషయంపై వర్షనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా. సోషల్ మీడియాలో ఎలాగో గ్లామరస్ ఫోటోలు పెడుతున్నావ్ కదా.. సినిమాల్లోకి వెళ్తే బాగుంటుందని కూడా వర్ష ఫ్యాన్స్ అడుగుతున్నారట. సో.. జబర్దస్త్ మానేయాలనే నిర్ణయం నిజమైతే.. వర్ష సినిమాల్లోకి రానుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఈ బ్యూటీ మున్ముందు ఎలాంటి ట్విస్ట్ ఇవ్వనుందో!