నటించింది కొన్ని చిత్రాల్లోనే అయినా సరే.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాక అభిమానులు చేత లేడీ సూపర్ స్టార్‌గా పిలిపించుకుంటుంది సాయి పల్లవి. ప్రస్తుత కాలంలో హీరోయిన్ అంటే స్కిన్ షో చేస్తే చాలనుకుంటారు. కానీ సాయి పల్లవి విషయంలో అవేం కుదరవు. డ్యాన్, యాక్టింగ్‌తో అందరి చేత ప్రశంసలు పొందింది. ఇక స్కిన్ షోకి అమడదూరం సాయి పల్లవి. కథా ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ.. ముందుకు పోతుంది సాయి పల్లవి. ఇక కొన్ని రోజుల క్రితం గార్గి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో సాయి పల్లవి సినిమాలకు దూరం అయ్యింది.. మూవీస్‌కి గుడ్‌బై చెప్పి.. డాక్టర్‌గా రాణించాలి అనుకుంటుంది అంటూ బోలేడన్ని వార్తలు వచ్చాయి. వీటిపై సాయి పల్లవి నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇదిలా ఉండగా సాయి పల్లవికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. సాయి పల్లవి త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. అది కూడా పౌరాణిక చిత్రం ద్వారా హిందీ పరిశ్రమకు పరిచయం కాబోతుందని అని జోరుగా ప్రచారం సాగుతోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. ఆయన పక్కన సాయి పల్లవి.. సీత పాత్రలో నటించబోతుందని సమాచారం.
తొలుత ఈ పాత్ర కోసం దీపికా పదుకొణె, కరీనా కపూర్ పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం.. సాయి పల్లవిని.. సీత పాత్ర కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దర్శకనిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కే ఈ సినిమా.. వచ్చే సంవత్సరం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.