అక్కినేని హీరో నాగ చైతన్య మరోసారి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో చేరిపోయారు. గతేడాది ఆయన భార్య సమంత నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు.. వీరి విడాకులుకు కారణాలు ఇవే అంటూ మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. ఇక కొన్ని రోజుల క్రితం అక్కినేని అన్నదమ్ములిద్దరికి పెళ్లి సంబంధాలు కుదిరాయని.. ఇద్దరికి ఒకే వేదికపై వివాహాలు జరిపించేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. ఇవే కాక.. ప్రస్తుతం నాగ చైతన్య.. ఓ టాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కూడా జోరుగా ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. నాగ చైతన్య.. టాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాక తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..
ఓ హిందీ మీడియా కథనం ప్రకారం ప్రస్తుతం నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ రాసుకొచ్చింది. దీని ప్రకారం ప్రస్తుతం చై హైదరాబాద్‌లో కొన్న కొత్త ఇంటికి శోభిత నుఆహ్వానించాడు. ఇద్దరు కలిసి కొన్ని గంటల పాటు.. ఆ ఇంటిలోనే గడిపారు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కారులో కలిసి బయటకు వెళ్లారని రాసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Journalist Swapna: రెండో పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ స్వప్న అంటూ వార్తలు!
అంతేకాక మేజర్ ప్రమోషన్స్ కోసం శోభిత సిటీకి వచ్చిందని.. ఇక్కడ ఆమె స్టే చేసిన హోటల్‌కి చై పలు మార్లు వచ్చాడని సదరు కథనం పేర్కొంది. అంతేకాక రీసెంట్‌గా శోభిత పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించగా.. కేవలం సన్నిహితులు మాత్రమే వచ్చారని.. వీరిలో చై కూడా ఉన్నట్లు సదరు వార్త కథనం పేర్కొంది. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే.. చై, శోభిత ధూళిపాళ దీనిపై స్పందించాల్సి ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Virata Parvam Movie: విరాటపర్వంకి దారుణమైన కలెక్షన్స్! శాపంగా మారిన సాయి పల్లవి!