యాంకర్, జర్నలిస్ట్ స్వప్న గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. న్యూస్ రీడర్‌గా పలు చానెల్స్‌లో వర్క్ చేసింది. అంతేకాక ఎఫ్ఎం రేడియోలో కూడా పని చేసింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంది స్వప్న. వీటన్నింటిన్ని కన్నాకూడా.. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, కీ, నానీస్ గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో చిన్న చిన్న కేమియోలు చేసింది. ఈ క్రమంలో స్వప్నకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. అదేంటంటే.. స్వప్న సెకండ్ మ్యారేజ్ చేసుకుంది.. అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. స్వప్న.. రెండో వివాహం చేసుకోవడానికి కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లారట. అక్కడే ఆమె రెండో వివాహం చేసుకున్నారని.. జోరుగా ప్రచారం అవుతోంది. అంతేకాక ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటో అంటూ ఒక ఇమేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిలో స్వప్న పెళ్లి కుమార్తె గెటప్‌లో ఉన్నారు. అది ముస్లిం సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. అంతేకాక ఆమె అమెరికాలోనే సెటిల్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చూసిన వారంతా స్వప్న రెండో వివాహం చేసుకుంది అని భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: Beggar: బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం! 23 ఏళ్ళ తరువాత వరించిన అదృష్టం! ప్రస్తుతం స్వప్న వయసు 47 సంవత్సరాలు. ఆమెకు గతంలోనే వివాహం అయ్యింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె విడాకులు తీసుకుంది. ఇక గత కొంత కాలంగా ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె రెండో వివాహానికి చెందిన వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. దీనిపై స్పందించి.. స్వప్న అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Virata Parvam Movie: విరాటపర్వంకి దారుణమైన కలెక్షన్స్! శాపంగా మారిన సాయి పల్లవి!