దగ్గుబాటి రానా - సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపొందిన తాజాచిత్రం 'విరాట పర్వం'. ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడం.. అందునా సాయి పల్లవి, రానా వంటి సూపర్ కాంబినేషన్ ఉండటంతో.. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తొలిరోజే సినిమాకు పాజిటివ్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఇక సినిమా మొత్తం సాయి పల్లవి చుట్టే తిరిగుతుంది. రానా, ప్రియమణి, నందితాదాస్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర ఉన్నప్పటికి సినిమాలో సాయి పల్లవే ప్రధాన పాత్ర. దానికి తగ్గట్టే ప్రమోషన్లు నిర్వహించారు. ఇక లేడీ పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవినినే సినిమా ప్రమోషన్స్‌లో హైలెట్ చేశారు. ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడా ఆమెను హైలెట్ చేశారు. అయితే సినిమా టీమ్, దర్శకుడు ఇంతలా ఆకాశానికెత్తిన సాయి పల్లవి.. విరాట పర్వం చిత్రానికి మైనస్ అయ్యింది. అదెలా అంటే... ఇది కూడా చదవండి: Pradeep: ఢీ షో నుంచి తప్పుకున్న ప్రదీప్! కారణం ఏమిటంటే.. ప్రమోషన్స్ సందర్భంగా సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే.. కలెక్షన్స్ దారుణంగా పడిపోయానని భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సాయి పల్లవి.. కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. కశ్మీరి పండింట్లను ఎలా చంపారో ఆ సినిమాలో చూపించారన్నారు. కానీ ఇప్పుడు కూడా గోవధ చేస్తున్నారంటూ.. ఆవును తీసుకెళ్తున్న ముస్లీం డ్రైవర్‌ను కొట్టి జై శ్రీరామ్ అనాలన్నారు. అప్పుడు జరిగిన దానికి.. ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది అంటూ సాయి పల్లవి ప్రశ్నించింది. అయితే ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. సాయి పల్లవిపై కేసులు కూడా నమోదయ్యాయి. కొందరు నెటిజనులు.. సాయి పల్లవి వ్యాఖ్యలపై మండిపడటమే కాక.. విరాట పర్వం సినిమా చూడబోమని తేల్చి చెప్పారు. ఇక సాయి పల్లవి వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో పాటు.. విజయశాంతి కూడా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా మూడు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ. కోటి రూపాయల షేర్ కూడా రాలేదు. రెండో రోజు ఈ సినిమాకు రూ. 63 లక్షల రూపాయల షేర్.. మూడో రోజు.. రూ. 56 లక్షలు మాత్రమే వచ్చింది. టోటల్‌లో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.09 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక, రెస్టాప్ ఆఫ్ భారత్, ఓవర్సీస్ అన్ని కలిపి మూడు రోజుల్లో రూ. 3.14 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇది కూడా చదవండి: Naresh And Pavitra Lokesh: నరేష్ – పవిత్రా లోకేష్ పెళ్లి వార్తల్లో నిజం ఎంత? అసలు వీరి బంధం ఏమిటి? ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజులకు 2.27 షేర్‌తో పాటు రూ. 3.90 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చ్సింది. నిజానికి 'విరాట పర్వం' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 'విరాట పర్వం' మొత్తంగా రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. ఇక 14 కోట్ల బిజినెస్ కావడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.50 కోట్లని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2 రోజుల్లో 2.27 కోట్లు వచ్చాయంటే మరో 12.23 కోట్లు వస్తేనే సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది. టాక్ బాగానే ఉన్నా ఈ కలెక్షన్స్ చూస్తుంటే షాకింగ్ గా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. సినిమా ఓ వర్గం వారికి మాత్రమే నచ్చడం.. సాయి పల్లవి కామెంట్స్ అన్ని కలెక్షన్స్‌పై భారీ ప్రభావాన్ని చూపాయి అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Faima: మా ఇంట్లో పరిస్థతి అది.. వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి వచ్చాను: జబర్దస్త్ ఫైమా