సినీ ఇండస్ట్రీలోకి క్రికెటర్స్ రావడం అనేది కొత్తకాదు. ఇప్పటివరకు చాలామంది దిగ్గజ క్రికెటర్స్ నటులుగా సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు మరో దిగ్గజం కూడా చిత్రపరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అదికూడా నటుడిగా కాదు.. నిర్మాతగా అని తెలుస్తుంది. దిగ్గజ క్రికెటర్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని.. తన బ్యానర్ లో సౌత్ భాషలలో సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడని ఇప్పటికే వార్తలు జోరుగా సాగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ధోని సినిమాలు ప్రొడ్యూస్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. అయితే.. తమిళంలో దళపతి విజయ్ తో సినిమా చేయనున్నాడని కథనాలు వినిపిస్తుండగా.. ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్లు టాక్.
ఎంఎస్ ధోనికి తెలుగు రాష్ట్రాలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అలాగే ఎంఎస్ ధోని బయోపిక్ కూడా తెలుగులో బాగా ఆడింది. దీంతో ఎలాగో తెలుగులో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి.. తెలుగులో ఏ హీరోతో చేయనున్నాడనే వార్తలు ప్రేక్షకులలో ఆసక్తి రేపుతున్నాయి. ఎంఎస్ ధోని.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. తమిళంలో దళపతి విజయ్ తో, తెలుగులో మహేష్ బాబుతో, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ బలంగా నడుస్తుంది. ఈ లెక్కన మహేష్ బాబుతో ధోని సినిమా అంటే.. ఎలా ఉండబోతుందోనని క్లారిటీ రాకముందే ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రెండు భారీ సినిమాలను లైనప్ చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా.. మరోవైపు డైరెక్టర్ రాజమౌళితో పాన్ ఇండియా మూవీ క్యూలో ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ తో సినిమా త్వరలోనే షూట్ ప్రారంభం కానుండగా.. రాజమౌళితో సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో పట్టాలెక్కనుందని తెలుస్తుంది. మరి ఇంతలోనే ఎంఎస్ ధోని ప్రొడక్షన్ హౌస్ అని.. సౌత్ హీరోలతో సినిమాలని.. వాటిలో మహేష్ బాబుతో ఓ సినిమా అనేవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఎందుకంటే వీరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. చూడాలి మరి అంచనాలను రీచ్ అవుతారో లేదో!
#MSDhoni is planning on venturing into film production with ‘Dhoni Entertainment Limited’. He has planned to produce films of #ThalapathyVijay from Kollywood, #MaheshBabu from Telugu, #KicchaSudeep from Kannada and #Prithviraj from Malayalam cinema.https://t.co/AMAyd5puaI
— George (@VijayIsMyLife) October 12, 2022