క్షుద్ర పూజల నేపథ్యంలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ సినిమాలో చర్చించిన క్షుద్ర పూజలపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఆ వివరాలు..
మన దేశంలో అనాది కాలం నుంచి ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు, పునస్కారాలు కొనసాగుతు వస్తున్నాయి. ఇక హిందూ సమాజంలో దేవతలు ఎక్కువే.. పూజా విధానాలు కూడా భిన్నంగానే ఉంటాయి. కొన్ని పూజల్లో కేవలం పూలు, పండ్లు, కొబ్బరి కాయ వంటివి వాడితే.. కొన్ని రకాల పూజల్లో బలులు, మద్యం, తప్పనిసరి. మన ఇంట్లో, గుడిలో చేసే పూజలు వేరు.. కొందరు కావాలని ఒక అంశంపై పట్టు సాధించడం కోసం చేసే పూజలు వేరు. ఇక ఈ మధ్య కాలంలో మనం తరచుగా క్షుద్ర పూజలు అనే మాట వింటున్నాం. అలానే తాంత్రిక పూజలను కూడా చూస్తున్నాం. తాజాగా క్షుద్ర పూజల నేపథ్యంలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత భారీ విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో ప్రేక్షకులకు చేమటలు పట్టించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. దాంతో సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాక.. థియేటర్‌లో చూసిన జనాలు సైతం.. మరోసారి ఈ సినిమా చూసి భయపడుతూనే ఏంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం విరూపాక్ష ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న నేపథ్యంలో.. ఈ సినిమాలో చూపించిన క్షుద్ర పూజలపై మరో సారి తెగ చర్చించుకుంటున్నారు జనాలు.
అనారోగ్యంతో ఉన్న భార్యను కాపాడుకోవడం కోసం వైద్యుడయిన ఆమె భర్త వేదాలను ఆశ్రయిస్తాడు. చనిపోయిన మనిషి శరీరంలోని ఆత్మను.. తన భార్య ఒంట్లోకి పంపించి.. ఆమెను బాగు చేసుకోవాలని భావిస్తాడు. అతడు ఇలా పూజలు చేస్తుండగా.. ఊరి వాళ్లు మాత్రం చేతబడి చేస్తున్నారని భావించి.. ఆ దంపతులును సజీవదహనం చేస్తారు. అయితే కళ్ల ఎదుటే తల్లిదండ్రులు అత్యంత దారుణంగా చంపబడటంతో.. వారి పిల్లలు ఊరి మీద పగ పెంచుకుంటారు. తండ్రి మంచి కోసం చేసిన ప్రయోగాన్ని వారు ఊరు మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడుకోవాలని భావిస్తారు. దీనిలో భాగంగానే తండ్రి ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో పశుతత్వ విద్య నేర్చుకుని.. తమ మీద తామే ప్రయోగించుకుని ఊరిని నాశనం చేయాలని చూస్తారు.
దీనిలో భాగంగా ముందుగా ఊరిని అష్టదిగ్బందనం చేయడం కోసం ఏదో వైరస్ సోకేలా చేస్తారు. తర్వాత రవికిషన్ తాను నేర్చుకున్న పశుతత్వ తాంత్రిక విద్యను తన మీద ప్రయోగించుకుని.. ప్రేయసి కళ్లెదుటే మృతి చెందుతాడు. ఆ తర్వాత ఊరిలో వరుస మరణాలు. చివరకు సంయుక్త తనను తాను ఆత్మార్పణం చేసుకోవడం ద్వారా ఊరందరని ఒకేసారి చంపేయాలని భావిస్తుంది. ఆ సమయంలో హీరో వచ్చి అడ్డుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.
ఈ సినిమాలో చూపించిన క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలను ప్రస్తుత కాలంలో ఎవరు పెద్దగా నమ్మడం లేదు. సినిమాలో ప్రధానంగా పశుతత్వ క్షుద్ర పూజ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. సినిమా విడుదల తర్వాత ఈ పదం జనాలకు బాగా ఎక్కింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి ప్రయోగం ఏది నిజంగా లేదు. సినిమాలో అలా చూపించారు. అయితే ఓ 30-40 ఏళ్లక క్రితం వరకు జనాల మీద వీటి ప్రభావం బాగా ఉండేది. వరుసగా ఏవైనా దుర్ఘటనలు జరిగినా.. ఆరోగ్యంగా ఉన్న మనుషుల్లో ఉన్నట్లుండి మార్పు వచ్చినా.. చేతబడి, భానామతి, చిల్లంగి, గాలి సోకడం ఇలాంటి పేర్లు తెర మీదకు వచ్చేవి.
ఇప్పుడంటే మనం శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం కనుక.. ఏ చిన్న జబ్బు చేసినా, వైరస్‌లు అటాక్ చేసినా గుర్తించగలుగుతున్నాం.. తగిన జాగ్రత్తలు తీసుకుని.. ప్రమాదాల నుంచి బయటపడుతున్నాం. కానీ ఇవేవి లేని కాలంలో మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు ఏం జరిగినా.. వెంటనే జనాల దృష్టి చేతబడి, భానామతి, చిల్లంగి, గాలి సోకడం వంటి వాటి మీదకు మళ్లేది. ఎవరో తమ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారని.. అందుకే తమ ఇంట్లో, చుట్టూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని భావించేవారు. వాటి నుంచి విముక్తి పొందడం కోసం పూజారుల, బాబాల దగ్గరకు వెళ్లేవారు. వారు సూచనల మేరకు జంతు బలులు.. కొన్ని సార్లు నర బలులు కూడా ఇచ్చేవారు. కొన్నిసార్లు.. ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు అన్న అనుమానం ఉన్న వారిని సజీవ దహనం చేసేవారు.
అయితే వాస్తవంగా చెప్పాలంటే మనుషులు, జంతువుల మీద ఇలా క్షుద్ర పూజలు చేయడం అనేది పూర్తిగా అవాస్తవం.. అసలు ఇలాంటివి నిజంగా జరగవు అంటారు నిపుణులు. ఇవన్ని మన మైండ్‌లో ముద్రించుకుపోయిన భయాలు. కొందరు వాటికి.. ఇలా పేర్లు పెట్టి క్యాష్ చేసుకుంటారని తెలుపుతున్నారు. అయితే క్షుద్ర పూజలు సంగతి ఏమో కానీ కొన్ని తాంత్రిక విద్యల గురించి మాత్రం వేదాల్లో పేర్కొన్నారు. వాటిని ఎలా నిర్వహించాలి, పరిస్థితి చేయి దాటితే ఎలా కట్టడి చేయాలి అనే వాటి గురించి వేదాల్లో స్పష్టంగా వివరించారు అంటున్నారు పండితులు. అయితే ఇలాంటి తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి ఏంతో ఏకాగ్రత, పట్టుదల కావాలి. ఏమాత్రం తేడా వచ్చిన.. నేర్చుకునే విద్యకు మనమే బలయ్యే అవకాశం ఉంది అని వేద శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇక విరూపాక్షలో చూపించని విధంగా పశుతత్వ క్షుద్ర పూజ నిజంగా లేదు. కేవలం సినిమా కోసమే క్రియేట్ చేశారు. కానీ జనాలను బీభత్సంగా భయపెట్టగలిగి.. సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిపారు. మీరు విరుపాక్ష సినిమా చూశారా.. సినిమాలో చూపించినట్లు.. నిజంగానే ఇప్పుడు కూడా క్షుద్ర పూజలు ఉన్నాయని భావిస్తున్నారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.