బుల్లితెర యాంకర్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టి.. వెండితెరపై తనదైన ముద్ర వేస్తు దూసుకెళ్తోంది యాంకర్ అనసూయ. తన అందచందాలతో కుర్రకారు మనసులను కొల్లగొట్టడంలో అనసూయది తొలి స్థానం.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ పిక్స్ తో యువతకు నిద్రలేకుండా చేస్తూంటుంది. జబర్దస్త్ వదిలేసిన తర్వాత షోలల్లో కనిపించడం తగ్గించింది ఈ సోయగం. ఆంటీ వివాదంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ గా నిలిచింది. అప్పటి నుంచి పెద్దగా ఏ ఈవెంట్స్ లల్లో కనిపించట్లేదు అనసూయ. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా వేడుకకు హాజరయ్యింది. ఈ వేడుకలో మగాళ్లపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై యాంకర్ గా ఓ వెలుగు వెలిగి.. వెండితెరపైకి అడుగు పెట్టింది. వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. ఇక సమయం చిక్కినప్పుడల్లా ఫ్యామిలీతో వెకెషన్ కు వెళ్లి అక్కడి పిక్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా గురువారం జరిగిన ”మాయా పేటిక” అనే సినిమా గ్లింప్స్ రిలీజ్ వేడుకలో ముఖ్య అథిగా పాల్గొన్న అనసూయ.. తన చిలిపి మాటలతో ప్రేక్షకులను కవ్వించింది. ఈ వేడుకలో అనసూయ మాట్లాడుతూ..”నేను థ్యాక్యూ బ్రదర్ అంటే పాపం అందరూ ఫీలవుతారు. అందునే నేను చెప్పను. ఇక నాకు జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఓ కుటుంబం లాంటింది. మీ అందరిని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇక నాకు ఈ సినిమాలో చాన్స్ ఎందుకు ఇవ్వలేదో డైరెక్టర్ కారణాలు చెప్పారు కాబట్టి నేనేం అనట్లేదు. లేకపోతే పెద్ద యుద్దమే జరిగిపోయేదని” అనసూయ అన్నారు.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నేనూ చూశాను.. కామెడీ చాలా బాగుంది అని అనసూయ తెలిపింది. అందరు నన్ను స్వార్థపరురాలు అంటారు, అలాంటి నేనే సినిమా చాలా బాగుంది అని చెప్తున్నానంటే అర్దం చేసుకోండి. ఇక మాయా పేటిక టీమ్ అందరికి శుభాకాంక్షలు అంటూ అనసూయ మాట్లాడుకొచ్చింది. ఇదిలా ఉంటే థ్యాంక్యూ బ్రదర్ మూవీ తీసిని నిర్మాణ సంస్థ జస్ట్ ఆర్డినరీ ఎంటర్ టైన్మెంట్.. ఈ మాయా పేటికను నిర్మిస్తోంది. అందుకే ఈ మూవీ అన్ బాక్సింగ్ గ్లింప్స్ కు అనసూయను గెస్టు గా పిలిచారు మేకర్స్. థ్యాంక్యూ బ్రదర్ మూవీకి డైరెక్టర్ రమేశ్ రాపర్థి ఈ సినిమాకు తెరకెక్కించాడు. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, రజత్ రాఘవ్ లు ప్రధాన పాత్రలో నటించగా.. సునీల్, పృథ్వీ, హిమజ, యాంకర్ శ్యామల , తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.